Pages

Pages - Menu

10.6.12

సిరియాలో సైనిక కాల్పులు: 17 మంది పౌరుల మృతి



Blast
FILE
సిరియాలోని దారా పట్టణంలో సైనికులు జరిపిన కాల్పుల్లో 17 మంది పౌరులు హతమయ్యారు. ఈ విషయాన్ని మానవహక్కుల సంఘం ధ్రువీకరించింది. మృతుల్లో తొమ్మిది మంది మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిపింది. 

కాల్పుల్లో డజన్లకొద్దీ జనం గాయపడ్డారని, లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంఘం మిలటరీ దురాగతాలపై మానవ హక్కుల సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 

అధ్యక్షుడు బషర్ అలీ అసాద్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఆందోళనకారులపై మొదలైన సైనికుల ఊచకోత ఆగలేదని తెలిపింది. ఒక్క శుక్రవారమే దేశవ్యాప్తంగా 68 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటికి 13వేల 500 మంది చనిపోయారని మానవ హక్కుల సంఘం తెలిపింది.