Pages

Pages - Menu

18.6.12

నోట్లపై సరికొత్త ఫొటోలు



Jun-17-2012 10:02:59
భారతీయ కరెన్సీ రూపాయిపై ఇప్పటి వరకు మహాత్మగాంధీ బొమ్మనే ముద్రించే ఆనవాయితీ ఉంది. ఇలా ముద్రించేందుకు అర్హత గల ఇతర విశిష్టవ్యక్తుల పేర్లను సలహాల రూపంలో తెలియజేయాల్సిందిగా ఆర్‌బిఐ విజ్ఞప్తి చేస్తోంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌, ఛత్రపతి శివాజీ, జవహర్‌లాల్‌నెహ్రూ, ఇందిరాగాంధీ తదితరుల పేర్లు సిఫారసుల రూపంలో ఆర్‌బిఐ చెంతకు చేరాయి. దేశంలో ప్రతి చోట గాంధీ బొమ్మ కనిపించని చోటు ఉండదంటే అతిశయోక్తి కాదు ఈక్రమంలో దేశం కోసం త్యాగం చేసిన ఇతర మహనీయులను సముచిత రీతిన గౌరవించాలనే ఆశయంతో ఆర్‌బిఐ ఈచర్యకు ఉపక్రమించింది. 1987 నుంచి రు.500ల నోట్ల మీద కూడా గాంధీ చిరునవ్వు బొమ్మను మద్రించేవారు. 1996 నుంచి అన్ని డినామినేషన్ల మీద గాంధీ బొమ్మను ముద్రించడం మొదలైంది.