జూన్ 9 నుంచి 16వ తేదీ వరకూ తనకు ఆధ్యాత్మిక యాత్ర చేసేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ అక్రమాస్తుల కేసూలో ఎ-2గా ఉన్న విజయసాయిరెడ్డి పిటీషన్ దాఖలు చేసుకున్నారు. దీనిపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది.
కోర్టులో దీనిపై తన వాదనను వినిపించింది. జూన్ 9, 10 తేదీలలో విజయసాయిని ప్రశ్నిస్తామనీ, 11 వ తేదీన ప్రత్యేకంగా జగన్ మోహన్ రెడ్డి కేసుకు సంబంధించి ప్రశ్నించాల్సి ఉందని తెలిపింది. ఐతే జూన్ 13 తర్వాత తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది.
మరోవైపు జగన్ కేసుకు సంబంధించి కీలక నిందితుడుగా ఉన్న విజయసాయి రెడ్డిపై నగరం విడిచి వెళ్లకూడదన్న షరతు ఉంది.