Pages

Pages - Menu

12.6.12

తత్కాల్ ప్రయాణికులకు ఊరట..


హైదరాబాద్,న్యూస్‌లైన్: వేసవి రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తత్కాల్ టిక్కెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులకు రైల్వే శాఖ ఉపశమనం కల్పించింది. రద్దీని బట్టి ప్రతి రైలుకు అదనంగా చేర్చే బోగీల్లో తత్కాల్ టిక్కెట్ ప్రయాణికులకు తొలి ప్రాధాన్యతగా బెర్త్‌లు కేటాయించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. బెర్త్‌లు మిగిలిన పక్షంలో జనరల్ వెయిటింగ్ లిస్టు జాబితాలో ఉన్న ప్రయాణికులకు కేటాయిస్తామన్నారు.