Pages

Pages - Menu

8.6.12

సీఎం అయ్యేందుకు నాకున్న అర్హతలు జగన్‌కు లేవు : బాబు


chandrababu
రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు తనకున్నటువంటి అర్హతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఉన్నాయా అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వెస్ట్ గోదావరి జిల్లా పోలవరంలో ఆయన మాట్లాడుతూ... సీఎం అయ్యేందుకు కూడా కొన్ని అర్హతలు కావాలన్నారు. ఇవి తనకు మాత్రమే ఉన్నాయని, జగన్‌కు లేవన్నారు 

తాను అధికారంలోకి వస్తే.. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, ఒక్క రూపాయి కిలో బియ్యం పేరుతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. కిలో బియ్యం రూపాయికే ఇస్తూ.. ఇతర నిత్యావసర వస్తు ధరలను ఇష్టానుసారంగా పెంచేశారని ఇదెక్కడి న్యాయమన్నారు. 

ఇకపోతే.. జగన్ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. ఈ సొమ్ముతో హైదరాబాద్, బెంగళూరులలో భవంతులు కట్టుకున్నారని విమర్శించారు. పేదరికం లేని సమాజం చూడటమే తన జీవిత ధ్యేయమని అన్నారు. పోలవరం నిర్వాసితులకు పూర్తి న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందన్నారు.