Pages

Pages - Menu

9.6.12

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రి టిజి



కర్నూల్: జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సిరివెల్ల కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి రాష్ట్ర మంత్రి టిజి వెంకటేశ్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. సహచర మంత్రుల సాక్షిగా ఆయన గీత దాటారు. సమావేశంలో మాట్లాడిన టిజి వెంకటేశ్.. రోశయ్యను ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆర్యవైశ్యులకు పిలుపునిచ్చారు. ఆయనతో పాటు మంత్రులు శత్రుచర్ల విజయరామరాజు, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసులు ప్రచారంలో పాల్గొన్నారు.