NEWS

Blogger Widgets

14.6.12

రామ్ చరణ్ కి అరుదైన గిప్ట్



రామ్ చరణ్ కి ఆయన అత్తమామలు అరుదైన గిప్ట్ ఇచ్చి ఆనందపరిచారు. రూ.రెండుకోట్లు ఖరీదైన ఆస్టన్ మార్టిన్ కారును అల్లుడికి బహూకరించారు. కేవలం ఇద్దరు మాత్రమే కూర్చునే వీలుండే ఈ కారు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. చరణ్‌ని పెళ్లి కొడుకుని చేసిన సందర్భంగా కారుని అందించారు. ఆస్టన్‌ మార్టన్‌ వాంటేజ్‌ వి8 మోడల్‌ కారు అది. గచ్చకాయ రంగులో ఉందా కారు. ఇందులో ఇద్దరు మాత్రమే కూర్చొనే వీలుంటుంది. స్పోర్ట్స్‌ కారు ఇది.

జేమ్స్‌బాండ్‌ చిత్రం 'క్యాసినో రాయల్‌'లో బాండ్‌ ఈ బ్రాండ్‌ కారునే వినియోగించారు. ఈ తరహా కారు హైదరాబాద్‌లోనే మొదటిది కావటం విశేషం. రామ్‌చరణ్‌ వివాహ ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. అపోలో ఆస్పత్రుల అధినేత ప్రతాప్‌ సి.రెడ్డి మనుమరాలు ఉపాసన మెడలో ఆయన గురువారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు తాళి కడతారు. వీరి వివాహానికి హైదరాబాద్‌ నగర శివార్లలో ఉపాసన కుటుంబీలకు ఉన్న వ్యవసాయ క్షేత్రం వేదికైంది. ప్రతాప్‌ సి.రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

వ్యవసాయ క్షేత్రంలోని సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో వివాహ ఏర్పాట్లను చేశారు. ఆ ప్రాంగణంలో సుమారు 5 వేల మంది అతిథులు ఆసీనులయ్యే వీలుంది. కల్యాణ మంటపాన్ని పచ్చటి తోరణాలతో అలంకరించారు. భారీ సెట్టింగులతో కల్యాణ వేదిక కనువిందు చేస్తోంది. కళ్లు చెదిరేలా విద్యుద్దీపాలతో తీర్చిదిద్దారు. విదేశాల నుంచి తీసుకొచ్చిన పుష్పాలతో అలంకరించారు. వివాహానికి ఆహ్వానితులు మినహా ఇతరులు ఎవరూ లోపలికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. వివాహ ఆహ్వాన పత్రికతోపాటు లోపలికి వెళ్లేందుకు రహస్య సంకేతంగల కార్డులను అందజేశారు.