NEWS

Blogger Widgets

15.6.12

ప్రణబ్‌ పేరును ప్రకటించిన సోనియా



Jun-15-2012 06:54:48
న్యూఢిల్లీ : యూపీఏ రాష్ర్టపతి అభ్యర్థిగా ప్రణబ్‌ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధినేత సోనియా గాంధీ ఒక ప్రకటనలో వెల్లడించారు. కాగా కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న ప్రణబ్‌ ఈనెల 24న తన మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. ప్రణబ్‌కు మద్దతుగా నిలవాలని భాగస్వామ్య పక్షాలను సోనియా కోరింది. రాష్టప్రతి ఎన్నికల్లో పోటీచేసేందుకు అబ్దుల్‌ కలాం ఇష్టపడలేదు.

Jagan follower fires in air, arrested


YSR Congress party leader M A Rahman landed himself in deep trouble by firing in air with his pistol as a mark of celebration for the victory of the party in the by-elections.
Rahman took out his weapon and fired in the air three rounds, raising Jai Jagan and Jai YSR slogans in front of the YSR Congress party office at Jubilee Hills, even as the media persons were watching him with anxiety. He was mobbed by the party workers and a little carelessness on his part, there would have been a misfire and the bullet could have pieced through the people around him.
Immediately, the local channels aired the incident and described it as a dangerous signal. One of the channels, obviously anti-Jaganmohan Reddy, went a step a ahead and worried whether Jagan’s party would make the state into Bihar, where party leaders use weapons freely. Rahman tried to give clarification later that he had to do it as a mark of celebration and was not intended at hitting anybody. Later he changed the stand and said he had to do it in self-defence.
The Election Commission authorities took the incident seriously and instructed the police to take action against Rahman. The Jubilee Hills police later arrested him on the directions of the EC.

Jagan gets VIP treatment in jail!


As the by-poll results started emerging one after the other since Friday morning, the authorities in Chanchalguda jail are learnt to have changed their behaviour towards YSR Congress party president Y S Jaganmohan Reddy, who has been in the jail for the last three weeks in connection with his alleged illegal assets case being probed by the CBI.
Despite repeated appeals by Jagan, the jail authorities initially refused to provide him cable television facility, as under-trials can watch only Doordarshan and Saptagiri channels even if they are special category prisoners. However, an hour later when it was clearly emerging that YSR Congress party is sweeping polls, the jail authorities took him to the air-conditioned chamber deputy superintendent of the prison, where there was a colour television with cable facility.
Sources said they even allowed to him make telephone calls to his party colleagues and advisors to know the trends from time to time. The afternoon lunch was also provided in the jail official’s chamber. He kept on interacting with his party leaders till the counting is completed. And when his mother, wife and sister came to jail to meet him, they were taken to Jagan and the “mulaqat” took place in the official’s chamber itself, sources said.
After all, no official can afford to displease the person who has all the potential to become future chief minister!

Andhra Jyothy Brought Many Lives On Roads


Andhra Jyothy had published an exit poll survey a few days ego that proved absolutely wrong today.
 
Believing the survey in their most favorite News Daily, many readers have invested crores of rupees in betting. It is known that betting is not legal, but the main cause for this syndrome is surveys. Media houses should be unbiased in surveying or else should maintain silence.  
 
Today, those have invested in betting believing in AJ survey has come on to roads. The survey stated that YSRCP loses in a few constituencies but the party won with 20000 plus majority in those places.

లక్ష్యాన్ని ఛేదించిన జగన్, కాంగ్రెస్ గుండెల్లో జగన్ బుల్లెట్


 YSRCP jagan, AP by poll results, jagan wins by polls, ys jagan congress, TDP jaganవై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి జైలులో ఉన్నా కాంగ్రెస్ గుండెల్లో మంటలు రేపాడు. ఉపఎన్నికల్లో అత్యధికస్థానాలు గెలుచుకుని అధికార కాంగ్రెస్ పార్టీని కలవరపెట్టాడు. సిబీఐ అనే బ్రహ్మాస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ జగన్ పై ప్రయోగించినా అది లక్ష్యాన్ని ఛేదించటంలో విఫలమైంది. దీనికి ప్రతిగా జగన్ సంధించిన సానుభూతి అస్త్రం కాంగ్రెస్ ను కళావికలం చేసింది. నేడు తగిలిన ఈ దెబ్బ రాష్ట్రంలో కాంగ్రెస్ కు భవిష్యత్తులో పెద్దముప్పుగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రెండున్నర నెలల క్రితం తెలుగుదేశంపార్టీ కిరణ్ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ తీర్మానానికి మద్దతుగా వై.ఎస్. సానుభూతిపరులైన ఎమ్మెల్యేలు ఓటువేసి అనర్హత వేటుకు గురయ్యారు. దీంతో రాష్ట్రంలో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. జగన్ చేస్తున్న ఓదార్పుయాత్రలకు అనూహ్య స్పందన్ వస్తుండటంతో అటు కాంగ్రెస్, ఇటు టిడిపిలు బెంబేలెత్తాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ఎన్నికలను సాకుగా తీసుకుని జగన్ పార్టీని భూస్థాపితం చేయటానికి రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి. కాంగ్రెస్ పార్టీ అయితే తన ఆఖరి అస్త్రంగా సిబీఐను ప్రయోగించింది సిబీఐ జగన్ ను జైలులో పెట్టినా ఫ్యానుగాలి జోరు తగ్గకపోగా, విజయమ్మ, షర్మిల రూపంలో పెద్ద తుఫానుగా మారి కాంగ్రెస్, టిడిపిలను కుదిపేసింది. రాజశేఖరరెడ్డి అవినీతికి పాల్పడ్డారని, జగన్ దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడని కాంగ్రెస్, టిడిపిలు ఊరువాడా ప్రచారం చేసినప్పటికీ ఎటువంటి స్పందన కనిపించలేదు.


గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సుమారు 37.03 శాతం ఓట్లు, తెలుగుదేశంపార్టీకి 35.66 శాతం ఓట్లు, ప్రజారాజ్యం పార్టీకి సుమారు 15.6 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనం కావటంతో ఈ ఓట్ల శాతం 51 శాతంకు పెరిగింది. దీనికి తోడు టిడిపికి ఉన్న 35.56 శాతాన్ని కూడా కలిపితే సుమారు 87 శాతం ఓట్లు ఈ మూడు పార్టీలకు వచ్చినట్లు భావించాలి. అయితే 0 స్థాయినుంచి ప్రారంభమైన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలను మట్టికరిపించింది. ఒకరకంగా చెప్పాలంటే బైబిల్ కథలోని డేవిడ్ అనే చిన్నకుర్రాడు తన చేతిలోని వడిశేలతో గొలియత్ అనే ఒక భీకరాకురుడిని హతం చేసిన సంఘటన గుర్తుకు వస్తుంది. ఇక్కడ జగన్ అనే జూనియర్ రాజకీయనాయకుడు ఏకంగా ఇద్దరు ప్రత్యర్థులకు ఒకేసారి మట్టికరిపించాడు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపిలతో పాటు బలమైన మీడియా వర్గాలు కూడా జగన్ కు వ్యతిరేకంగా తీవ్రంగా స్పందించాయి. సోనియాగాంధీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తేసుకుని వాయలార్ రవి, గులాంనబీ ఆజాద్ వంటి సీనియర్లకు ఎన్నికల ప్రచారానికి పంపింది. అలాగే టిడిపి అన్ని చోట్ల ఏరికోరి డబ్బున్నవారికే టిక్కెట్లు కట్టబెట్టింది. ఇక జగన్ ను వ్యతిరేకించే ఎలక్ట్రానిక్ ఛానల్స్, వార్తాపత్రికలు జగన్ అవినీతిపై పుంఖానుపుంఖాలుగా వ్యతిరేక వార్తలు గుప్పించాయి. జగన్ కు ఓటు వేస్తే ప్రజలు అవినీతిని సమర్థించినట్లేనని తీర్మానించాయి. అయినా ఓటర్లు మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. అవినీతి ఆరోపణలు అందరిపైనా ఉన్నాయంటూ జగన్ కె తమ మద్దతును ప్రకటించారు.

కేంద్ర క్యాబినెట్ లో చిరజీవికి స్థానం లేనట్లే?


ఉప ఎన్నికల ఫలితాలు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి రాజకీయ ఎదుగుదలకు గొడ్డలిపెట్టులా మారాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటరమణ గెలిచి ఉంటే చిరంజీవికి క్యాబినెట్ స్థానం లభిస్తుందనే వార్తలు వచ్చాయి. చిరంజీవి 2009 ఎన్నికల్లో తిరుపతి నుంచే పోటీ చేసి గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఆయనకు రాజ్యసభ సభ్యత్వం నజరానాగా లభించడంతో అసెంబ్లీకి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. తన రాజకీయ భవిష్యత్తుతో ముడిపడిన ఎన్నికలను చిరంజీవి కూడా సవాల్ గా తీసుకున్నారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా నియోజకవర్గం అంతా ప్రచారం చేశారు. జగన్ పై వ్యక్తిగత వైరం లేకపోయినప్పటికీ ఆయన్ని ఎన్నికల ప్రచారం సందర్భంగా తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ తో పాటు మాజీ పి.ఆర్.పి. శ్రేణులు కూడా కలిసి వస్తే వెంకట రణమ విజయం నల్లేరుపై నడకేనని ఆయన అంచనా వేశారు. ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధిస్తే అధిస్థానం తనకు కేంద్ర క్యాబినెట్ లో చోటు కల్పిస్తుందన్న హామీ వుండడంతో ఆయన రెచ్చిపోయి మరీ ఎన్నికల ప్రచారం చేశారు. అయితే అనూహ్యంగా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పరాజయం పాలవడంతో చిరంజీవి కంగుతిన్నారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన స్థానంలో తిరిగి తన మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థిని గెలిపించుకోలేకపోయాడనే అపవాదును ఆయన మూతగాట్టుకున్నట్లయింది. ఈ ఓటమితో రాష్ట్ర కాంగ్రెస్ లో చిరంజీవికి ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంటుంది.

ప్రధానిని రాష్ట్రపతి భవన్‌కు పంపించేది లేదు: కాంగ్రెస్ స్పష్టం



Manmohan
FILE
దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ను రాష్ట్రపతి భవన్‌కు పంపించే ప్రసక్తే లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ రాష్టప్రతి పదవికి ప్రతిపాదించిన పేర్లను కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా తిరస్కరించింది.

ప్రధాన మంత్రిగా ఉన్న మన్మోహన్‌ను రాష్ట్రపతిగా ఎన్నుకోవాలనే ప్రతిపాదనను ఎలా అంగీకరిస్తామని కాంగ్రెస్ మీడియా విభాగం ఛైర్మన్ ద్వివేదీ ప్రశ్నించారు. మన్మోహన్ 2014 వరకు ప్రధానిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. 

సంకీర్ణ ప్రభుత్వం నాయకుడిని మధ్యలో మార్చుకునే ప్రసక్తే లేదన్నారు. మిత్రపక్షాలైన టిఎంసి, ఎస్పీలు రాష్టప్రతి పదవికి ప్రతిపాదించిన మన్మోహన్, మాజీ రాష్టప్రతి ఏపిజె అబ్దుల్ కలాం, లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ అభ్యర్థిత్వాలను ఖరాఖండీగా తిరస్కరించినట్లు వెల్లడించారు. 

రాష్టప్రతి పదవికి అందరూ ఆమోదించే అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చర్చల ప్రక్రియ కొనసాగిస్తున్నట్టు ద్వివేది తెలిపారు.

నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ కు డిపాజిట్ గల్లంతు


హైదరాబాద్: ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ చావుదెబ్బతింది. 18 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం రెండు చోట్ల మాత్రమే విజయం సాధించింది. నాలుగు చోట్లయితే కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. అనంతపురం, పత్తిపాడు, మాచర్ల, పోలవరం నియోజకవర్గాల్లో కాంగీయులు ధరావతు కోల్పోయారు. ప్రతిపక్ష టీడీపీ ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయింది.

జై జగన్: 15 స్థానాల్లో వైయస్సార్సీపి ఫ్యాన్ హవా



శుక్రవారం, జూన్ 15, 2012, 15:23 [IST]
 Jai Jagan Ysrcp Wins Majority Seats
హైదరాబాద్: ఉప ఎన్నికల్లో ప్రజలు జై జగన్ అన్నారు. వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రజలు అత్యధిక స్థానాలు కట్టబెట్టారు. రాష్ట్రంలోని 18 శానససభా స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 15 స్థానాల్లో విజయం సాధించింది. చిరంజీవి ప్రాతినిధ్యం వహించిన తిరుపతిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే గెలుచుకుంది. నెల్లూరు లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఘన విజయం సాధించారు. అయితే, కొన్ని స్థానాల్లో మెజారిటీ స్వల్పంగా ఉండడం వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కలవరపెట్టే విషయం.
పరకాలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొండా సురేఖతెరాస అభ్యర్థి బిక్షపతికి గట్టి పోటీ ఇచ్చారు. ఈ స్థానంలో కాంగ్రెసు, బిజెపిలకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. కాంగ్రెసు ఐదో స్థానంలో నిలిచింది. తెలుగుదేశం పార్టీ మూడో స్థానంలో నిలిచింది. దీంతో తెలంగాణలో తెరాసకు దీటుగా తామే ఉంటామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు దీమా వ్యక్తం చేస్తున్నారు.
వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నర్సన్నపేట, పాయకరావుపేట, పోలవరం, ప్రత్తిపాడు, మాచర్ల, ఒంగోలు, ఉదయగిరి, తిరుపతి, అనంతపురం అర్బన్, రాయదుర్గం, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు, తిరుపతి స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు, రామచంద్రాపురంలో కాంగ్రెసు అభ్యర్థి తోట త్రిమూర్తులు విజయం సాధించారు. పరకాలలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ మాచర్ల, ప్రత్తిపాడు, ఒంగోలు వంటి స్థానాల్లో గట్టి పోటీనే ఇచ్చింది. మాచర్ల, ప్రత్తిపాడుల్లో కాంగ్రెసు పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. అయితే, ప్రకాశం, గుంటూరు జిల్లాలు తెలుగుదేశం పార్టీకి బలమైనవి.
రామచంద్రాపురం, తిరుపతి, ఉదయగిరి, నరసన్నపేట వంటి స్థానాల్లో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. తిరుపతిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి, కాంగ్రెసు అభ్యర్థి వెంకటరమణకు మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొన్నా భూమన కరుణాకర్ రెడ్డి బయటపడే అవకాశాలున్నాయి. రామచంద్రాపురంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ తొలుత కాంగ్రెసు అభ్యర్థి తోట త్రిమూర్తులపై ఆధిక్యం సాధించారు. అయితే తర్వాత తోట త్రిమూర్తులు పుంజుకుని విజయం సాధించారు.
తెలంగాణలోని పరకాల స్థానాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి బిక్షపతి దక్కించుకున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొండా సురేఖ రెండో స్థానంలో నిలిచారు. తెలుగుదేశం పార్టీ మూడో స్థానంలో నిలిచింది. తెరాసకు సవాల్ విసిరి మహబూబ్‌నగర్ ఫలితాన్ని పరకాలలో పునరావృతం చేస్తామని పోటీకి దిగిన బిజెపికి పరాభవం తప్పలేదు.
ప్రస్తుత ఫలితాలతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెరాస శాసనసభలో తమ బలాలను పెంచుకున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలం రెండు నుంచి 17కు పెరిగింది. ఇంతకు ముందు వైయస్సార్ కాంగ్రెసు నుంచి వైయస్ విజయమ్మ, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెరాస బలం 16 నుంచి 17కు పెరిగింది. ఓ అనుబంధ సభ్యుడు కూడా తెరాసకు ఉన్నాడు.
ఈ నెల 12వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. శుక్రవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 18 శాసనసభా నియోజకవర్గాలకు, ఓ లోకసభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధిక స్థానాలు గెలుస్తుందనే అంచనాలు నిజమయ్యాయి.
18 స్థానాల్లో గెలిచిన అభ్యర్థులు
1. నర్సన్నపేట - ధర్మాన కృ-ష్ణదాస్ (వైయస్సార్సీపి), 
2. పాయకరావుపేట - గొల్ల బాబూరావు (వైయస్సార్పీ), 
3. రామచంద్రాపురం - తోట త్రిమూర్తులు (కాంగ్రెసు),
4. నర్సాపురం - కొత్తపల్లి సుబ్బారాయుడు (కాంగ్రెసు), 
5. పోలవరం - తెల్లం బాలరాజు (వైయస్సార్సిపీ), 
6. ప్రత్తిపాడు - మేకతోటి సుచరిత (వైయస్సార్సీపి), 
7. మాచర్ల - పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి (వైయస్సార్సిపీ), 
8. ఒంగోలు - బాలినేని శ్రీనివాస రెడ్డి (వైయస్సార్పీపి), 
9. ఉదయగిరి - మేకపాటి చంద్రశేఖర రెడ్డి (వైయస్సార్సిపీ),  
10. తిరుపతి - భూమన కరుణాకర్ రెడ్డి (వైయస్సార్సిపీ), 
11. అనంతపురం - గుర్నాథ్ రెడ్డి (వైయస్సార్సిపీ), 
12. రాయదుర్గం - కాపు రామచంద్రా రెడ్డి (వైయస్సార్సీపి), 
13. ఎమ్మిగనూరు - ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి (వైయస్సార్సిపీ), 
14. ఆళ్లగడ్డ - శోభానాగి రెడ్డి (వైయస్సార్పిపి), 
15. రాజంపేట - ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, 
16. రాయచోటి - గండికోట శ్రీకాంత్ రెడ్డి (వైయస్సార్సిపీ), 
17. రైల్వే కోడూరు - శ్రీనివాసులు (వైయస్సార్సిపీ), 
18 పరకాల - బిక్షపతి (తెరాస)
నెల్లూరు లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి విజయం సాధించారు.


PartyNameParty FlagLeadWon
015
02
00
01
01

ఉత్కంఠ పోరులో పరకాలలో కొండా సురేఖ ఓటమి!

konda surekha
File
FILE
వరంగల్ జిల్లా పరకాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల పోరు తెలంగాణ వాదాన్ని నమ్ముకుని రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ముచ్చెమట పోయించింది. ఈ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి కొండా సురేఖ టీఆర్ఎస్ దూకుకుడు బ్రేకుల్ వేయించారు. ఒక దశలో టీఆర్ఎస్ అభ్యర్థికి వేలల్లో ఉన్న మెజార్టీని కొండా సురేఖ పూర్తిగా తగ్గించిన 151 ఓట్ల ఆధిక్యాన్ని సంపాదించుకున్నారు. అయితే, 17వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి మళ్లీ పుంజుకుని 556 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్లారు. 

రాష్ట్రంలో జరిగిన 18 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పరకాల స్థానం ఒకటి. ఈ స్థానం ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా.. టీఆర్ఎస్ తెలంగాణ వాదాన్ని నమ్ముకుని బరిలోకి దిగగా, కొండా సురేఖ మాత్రం తన వ్యక్తిగత బలంతో పాటు.. జగన్, వైఎస్ఆర్ సంక్షేమ పథకాలను నమ్ముకుని బరిలోకి దిగారు. 

ఈ ఓట్ల లెక్కింపులో 12వ రౌండ్ వరకు తెరాస అభ్యర్థి ఐదు వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఉన్నారు. అయితే, 13, 14, 15 రౌండ్లలో కొండా సురేఖ దూకుడు ప్రదర్శించి ఆధిక్యాన్ని కూడబెట్టుకున్నారు. ఒక దశలో కేవలం టీఆర్ఎస్ అభ్యర్థి మెజార్టీని 120 ఓట్లకు తగ్గించారు. ఆ తర్వాత 16, 17, 18 రౌండ్ల ఓట్ల లెక్కింపులో ళ్లీ టీఆర్ఎస్ అభ్యర్థి పుంజుకుని 556 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 

చివరి 19వ రౌండ్‌లో 4300 ఓట్లు ఉండగా, ఈ రౌండ్‌లో కూడా తెరాస అభ్యర్థి భిక్షపతి ఆధిక్యం సాధించడంతో పరకాల టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లిపోయింది. మొత్తమ్మీద కొండా సురేఖ టీఆర్ఎస్ అభ్యర్థితో పాటు.. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు ముచ్చెమటలు పోయించారని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి 800 చిల్లర ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Death Blow For TDP In 7 Dream Places



TDP dreamt a lot to win in 7 constituencies in this by poll. They are:
Macherla, Prathipadu, Polavaram, Ongole, Payakaraopet, Emmiganooru, Rayadurgam.
But the result is a death blow. YSRCP won in all these places with highest majority. So its proving that TDP, as regional party, has become an evening Sun in the state.

YSR Congress headed for clean sweep in by-elections


Hyderabad: Riding on the sympathy wave in the wake of its leader Y.S. Jaganmohan Reddy's arrest, the YSR Congress Party (YSRCP) appears to be headed for a clean sweep in the by-elections to the Nellore Lok Sabha and 18 assembly seats.
The counting of votes began at 8 a.m. amid tight security in the constituencies spread over 12 districts. About 70 percent polling was recorded in Nellore and an average 80 percent in the assembly constituencies.
YSRCP bagged the Yemmiganur assembly seat, while leading in Nellore and 14 assembly constituencies. The ruling Congress, Telugu Desam Party (TDP) and Telangana Rashtra Samithi (TRS) were ahead on one seat each.
In Yemmiganur in Kurnool district, YSRCP candidate K. Chenna Keshav Reddy was elected with a huge majority of over 17,000 votes.
The by-elections were caused by the resignation of one member of parliament and disqualification of 17 legislators of the Congress party who had switched loyalties to the YSRCP.
The Tirupati assembly seat fell vacant after the election of actor-turned-politician Chiranjeevi to the Rajya Sabha.
Jagan, as the YSRCP leader is popularly known, was arrested by the Central Bureau of Investigation (CBI) and sent to jail on May 27 in an illegal assets case when he was busy campaigning for the party. His mother Y.S. Vijayamma and sister Sharmila managed to evoke sympathy by accusing Congress and TDP of targeting Jagan.
Vijayamma even pointed finger at Congress party by raising her doubts over the cause of the Sep 2, 2009 helicopter crash which killed her husband and then chief minister Y.S. Rajasekhara Reddy.
Jagan and Vijayamma had quit Congress party and Kadapa Lok Sabha and Pulivendula assembly seats respectively in late 2010 accusing Congress of trying to split their family. They floated the YSRCP promising to implement the pro-poor schemes launched by YSR.
They retained the seats with a massive majority in the by-elections held last year.
In March this year, YSRCP also won Kovur assembly seat in Nellore district in the by-election caused by the resignation of TDP legislator.

TDP Lost Where It Had Hopes!



More than the Congress, it was the Telugu Desam Party which has received a rude shock in the by-elections to 18 assembly seats and one Lok Sabha seat.
The TDP has lost in all the seats where it had high hopes of winning and putting up a tough fight. The TDP leaders and their media bandwagon predicted that the party would win in Emmiganur, Prathipadu, Macherla and Polavaram, but in all these seats, the TDP lost the polls with a heavy margin.
For example, in Emmiganur constituency, YSR Congress party candidate Chennakesava Reddy had won the seat with a huge margin of over 20,000 votes.
Similarly, in Prathipadu, the YSR Congress party candidate Sucharita had won the seat with over 16,000 votes and in Macherla, on which the TDP was pinning hopes, the YSR Congress candidate P Ramakrishna Reddy emerged victorious with a margin of over 15,000 votes. On the other hand, in Polavaram, YSR Congress party candidate Balaraju registered a huge majority of over 26,000 votes.
So, the TDP’s hopes of winning at least one or two seats were completely shattered. And Andhra Octopus Lagadapati Rajagopal’s prediction on the TDP performance has fallen flat.

Two Seats, A Face Saving For Congress



The outcome of the by-elections in Narasapuram and Ramachandrapuram constituencies has come as a sort of face saving for the Congress party.
Though the party managed to win the seats with a slender margin – over 5,000 votes in Narsapuram and over 7,000 votes in Ramachandrapuram, it has given some sort of morale boosting for the party.
In other constituencies in the coastal Andhra, too, such as Narsannapet and Payakaraopet, the Congress has managed to give some tough fight to the YSR Congress party.
It would have been in a total disaster for the ruling Congress party, had it been routed in all the constituencies, as was predicted by a couple of exit-poll surveys. It would have triggered in large scale exodus of the MLAs from the Congress into YSR Congress. Now, the MLAs would think twice before making a plunge into the Jagan party, though the Congress party is still in a state of disarray.
All said and done, the Congress party would have to focus on strengthening the party in the coming months and intensifying the developmental programmes, rather than only on targeting Jaganmohan Reddy. Otherwise, it would be in for a total disaster.

ఎమ్మిగనూరులో వైఎస్ఆర్ సీపీ విజయం


ఎమ్మిగనూరు : : ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎర్రకోట చెన్నకేశవరెడ్డి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ రెండో స్థానంతో సరిపెట్టుకోగా, కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో నిలిచింది. చెన్నకేశవరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు.

ఉప ఫలితాలు : పరకాల స్థానంలో హోరాహోరీగా పోరు!



రాష్ట్రంలో వెల్లడవుతున్న ఉప ఎన్నికల్లో భాగంగా పరకాల స్థానంలో పోరు హోరాహోరీగా సాగుతోంది. ఈ స్థానంలో తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది. 12 రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి సుమారు ఆరు వేల ఓట్ల మెజార్టీలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి.. 15వ రౌండ్ ముగిసే సమాయనికి ఆ మెజార్టీ కేవలం 668 ఓట్లకు చేరుకుంది. 


మరో ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు సాగించాల్సి ఉంది. ఈ రౌండ్లలో స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖకు గట్టి పట్టుంది. ఇది మంచి ప్రభావం చూపడంతో టీఆర్ఎస్ మెజార్టీ గణనీయంగా తగ్గిపోయింది. మొత్తం మీద పరకాల ఉప పోరు.. క్షణం క్షణం ఉత్కంఠభరితంగా మారిపోతోంది.

నిలకడగా చిరంజీవి మనవరాలు షారా ఆరోగ్యం


 Chiru S Granddaughter Health Curing

హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు, తిరుపతి మాజీ శాసనసభ్యుడు చిరంజీవి మనవరాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. సోమవారం మెట్లపై నుంచి చిరు పెద్ద కుమార్తె సుష్మిత తనయ షారా కిందపడటంతో తలకు గాయమైన విషయం తెలిసిందే. పాపను చిరంజీవి హాస్పిటల్‌కు తరలించారు. ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళవారం చిరుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోనే ఉండి షారా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. పాపకు అపాయం లేదని రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.
కాగా చిరంజీవి మనవరాలు ప్రమాదవశాత్తూ భవనంపై నుండి పడిపోవడంతో చిన్నారి తలకు దెబ్బలు తగిలిన విషయం తెలిసిందే. అక్కడే ఉన్న చిరంజీవి వెంటనే స్వయంగా అపోలో ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ప్రస్తుతం ఆ పాప చికిత్స పొందుతోంది. చిరు తనయుడు రామ్ చరణ్ తేజ పెళ్లి వేడుకలలో భాగంగా సోమవారం మెహందీ వేడుకను నగరంలోని ఓ స్డూడియోలో నిర్వహిస్తున్నారు.
చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబ సభ్యులతో పాటు సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కూతురు ఆడుకుంటూ భవనం చివరి అంచు వరకూ వచ్చింది. అక్కడ ఉన్న వారు చూసి పిలిచేలోగా కిందకు పడిపోయింది.
దీంతో ఆమె తలకు గాయాలయ్యాయి. అది గమనించిన చిరంజీవి వెంటనే కారులో అపోలో ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అపోలో గ్రూపు ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి, రామ్ చరణ్ తేజ, అల్లు అర్జున్ సహా చిరంజీవి కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలి వచ్చారు. ఆసుపత్రి సిఈవో హరిప్రసాద్ నేతృత్వంలో ఐసియులో చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కాగా చిరంజీవి రెండు రోజుల క్రితం వరకు ఉప ఎన్నికల ప్రచారంలో హడావుడిగా ఉన్న విషయం తెలిసిందే. తనయుడి పెళ్లి మరికొద్ది రోజులలో ఉన్నప్పటికీ ఆ బాధ్యతలను కుటుంబ సభ్యులపై వేసి చిరంజీవి ప్రచారంలో జోరుగా పాల్గొన్నారు. రెండు రోజుల క్రితం ప్రచారం పూర్తవడంతో ఇప్పుడు చిరంజీవి కూడా పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు.

'వాన్‌పిక్‌'పై ఏం చేద్దాం?!



  • 15/06/2012
హైదరాబాద్, జూన్ 14: వివాదాస్పద వాన్‌పిక్‌పై ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఈ ప్రాజెక్టుపై ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే సంభవించే పరిణామాలు, కొనసాగితే నెలకొనే పరిస్థితులపై సర్కారు తర్జనభర్జన పడుతోంది. అటు అధికారులతో, ఇటు అడ్వకేట్ జనరల్‌తో విస్తృతంగా మంతనాలు సాగిస్తున్నప్పటికీ కసరత్తు కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వీలయినంత త్వరలో వాన్‌పిక్‌పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంబంధిత శాఖలను ఆదేశించినప్పటికీ ఇంకా తర్జనభర్జన కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ వివాదం బంతిని అడ్వకేట్ జనరల్ కోర్టులోకి పంపించిన అధికారులు అక్కడి నుంచి వచ్చే సలహా కోసం వేచి చూస్తున్నారు.
రాక్ ఆల్‌ఖైమా దేశంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వాడరేవు, నిజాంపట్నం ఓడ రేవుల అభివృద్ధి కోసం వాన్‌పిక్ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే మధ్యలో రాక్ సంస్థ మాట్రిక్స్ సంస్థతో అంతర్గత ఒప్పందం కుదుర్చుకోవడం, వాటాలపై కీలక నిర్ణయాలు తీసుకోవడం, పనుల నిర్వహణ వంటి అంశాలు, భూసేకరణ అంశాలు వివాదాస్పదమయ్యాయి. భూ సేకరణలో భారీగా అక్రమాలు జరిగాయన్నది కూడా వెలుగు చూడడంతో సిబిఐ విచారణ ప్రారంభమైంది. ఈ విచారణలో భాగంగానే అప్పట్లో పెట్టుబడులు, వౌళిక సౌకర్యాల శాఖ మంత్రిగా పనిచేసిన మోపిదేవి వెంకటరమణను కూడా సిబిఐ అరెస్టు చేసింది.
ఈ నేపథ్యంలోనే వాన్‌పిక్ ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకు ప్రభుత్వం ఆలోచన ప్రారంభించింది. నేరుగా రద్దు నిర్ణయాన్ని ప్రకటిస్తే వచ్చే సమస్యలపై ఏ నిర్ణయాన్ని తీసుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉండడంతో అన్ని కోణాల్లో న్యాయ సలహాలను కూడా తీసుకుంటోంది.
ప్రధానంగా ఈ ఒప్పందంలో రెండు సంస్థలు ఉండడంతో ఏలాంటి నిర్ణయం తీసుకోవాలన్న కోణంలోనే ప్రధానంగా ఆలోచన చేస్తోంది. ఆరోపణలకు గురైన మాట్రిక్స్‌పై చర్యలు తీసుకుంటూ నేరుగా రాక్ సంస్థకు అనుమతి కొనసాగిస్తే ఎలా ఉంటుందన్న కోణంలో కూడా అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇదే సమయంలో మొత్తం వాన్‌పిక్‌ను రద్దు చేస్తే సంభవించే పరిణామాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఒక దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేస్తే రెండు దేశాల మధ్య విబేధాలు తలెత్తే పరిస్థితి ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇది న్యాయపరమైన చిక్కులకు కూడా అవకాశం కల్పిస్తుందని వారు అంటున్నారు. అందుకే ఈ విషయంలో ఆచితూచి అడుగు ముందుకు వేయాలని భావిస్తున్నట్లు ఒక సీనియర్ అధికారి వెల్లడించారు.
ఆలాగే నేరుగా వాన్‌పిక్‌కు అనుమతులను రద్దు చేసుకుంటే సిబిఐ కేసులో కూడా సమస్యలు రావచ్చునన్న భావాన్ని మరికొంతమంది అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సిబిఐ కేసు దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే కేసు విచారణ బలహీనపడే అవకాశాలు ఉంటాయని, అది ప్రభుత్వంపై కూడా ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. ఇక రద్దు అంశాన్ని పక్కకు పెడితే అక్రమాలు జరిగిన సంస్థపై కూడా చర్యలు తీసుకోవడం లేదన్న అపప్రధను ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఇలా వాన్‌పిక్‌పై నిర్ణయం తీసుకునేందుకు అనేక కోణాల్లో ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు ఉండడంతో ఏమిచేయాలో అర్థం కాని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

'సీతమ్మ వాకిట్లో...'వెనక అసలు కథ


బుదవారం, జూన్ 13, 2012, 14:33 [IST]
వెంకటేష్,మహేష్ కాంబినేషన్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రం గురించి నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...విరగబూసిన సిరిమల్లె చెట్టుని ఆ పూట సీతమ్మకి అంకితం చేశారు. కొమ్మ కదలకుండా పూలు కోశారు. కోసిన పూలన్నీ వాలుజడకి చుట్టారు. సీతమ్మ సింగారం వెనక అసలు కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు దిల్‌ రాజు.
dil raju about seethamma vakitlo sirimalle chettu

‘స్విస్’లో పెరిగిన భారతీయుల సంపద!



  • 15/06/2012
న్యూఢిల్లీ, జూన్ 14: విదేశాల్లో భారతీయులు దాచుకున్న నల్లధనాన్ని వెనక్కితీసుకురావాలని ఓ వైపు జాతీయ స్థాయిలో ఉద్యమాలు జరుగుతుంటే, మరోవైపు స్విస్ బ్యాంకులో భారతీయుల సంపద నిల్వ గత ఐదేళ్లలో తొలిసారిగా పెరిగింది. స్విస్ నేషనల్ బ్యాంక్ తాజాగా ప్రచురించిన పుస్తకంలో పేర్కొన్న వివరాల ప్రకారం గత ఐదేళ్లలో తొలిసారిగా భారతీయుల సంపద విలువ 2.18 బిలియన్ల స్విస్ ఫ్రాంక్స్ అంటే రూ.12,740కోట్లకు చేరుకుంది. స్విస్ బ్యాంక్ అధికారుల వివరాల ప్రకారం - జమచేయబడిన నిధుల్లో భారత్‌లోని ఖాతాదారుల నుంచి నేరుగా వచ్చినవేకాక, నల్లధనం కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే భారతీయులు గాని, మరే ఇతర దేశస్థులు కాని దాచుకున్న నల్లధనాన్ని లెక్కల్లోకి తీసుకోలేదు. కాని 20 నుంచి 25 బిలియన్ల డాలర్లు ఉండవచ్చని అంచనా వేశారు. అయితే భారతీయులు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న ధనం 2006 నాటికి 6.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ (40వేల కోట్ల రూపాయలు) కాగా, అది 2010 నాటికి 33శాతం పడిపోయి, మళ్లీ 2011లో 3,500కోట్ల రూపాయలు పెరిగింది. భారత ప్రభుత్వం వివరించిన లెక్కల్లో కూడా స్విస్ బ్యాంకుల్లో జమ అయిన నిధులు 2006-2010 మధ్య కాలంలో 14వేల కోట్లకు పైగా క్షీణించినట్లు తెలిపింది. 2006లో స్విస్ బ్యాంకు ఖాతాల్లో 23,373కోట్ల నిధులుండగా, అది 2010 నాటికి 9,295కోట్లకు పడిపోయింది

.

నిత్యానందస్వామికి బెయిల్‌


బెంగుళూరు : సెక్స్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద స్వామికి బెయిల్‌ దొరికింది. దైవ స్వరూపుడుగా చెప్పుకుంటున్న వివాదస్పద నిత్యానందస్వామి బుధవారం అరెస్టయిన విషయం తెల్సిందే. రామనగరా ఫస్ట్‌ క్లాస్‌ జుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోమల కోర్టు గురువారం అతనికి బెయిల్‌ మంజూరు చేశారు. ఇక్కడికి 40 కి.మీ దూరంలో ఉన్న రామనగరా కోర్టులో లొంగిపోయిన అనంతరం నిత్యానందకు ఒక రోజు పోలీసు కస్టడీని కోర్టు విధించింది. అనంతరం ఆయన బెయిల్‌ పిటీషన్‌ వేసాడు. నేర ఆరోపణలు, అత్యాచారం కేసులలో 2010లో అరెస్టు అయిన అనంతరం బెయిల్‌పై వచ్చారు. ఇక్కడకు సమీపంలో ఉన్న బిదాడి ఆశ్రమం లో విలేకరుల సమావేశం నిర్వహించే సమయంలో విలేకరిపై అతను దాడి చేశారనే ఆరోపణలపై జూన్‌ 8న పోలీసులు కేసు నమోదు చేయడంతో కొత్త సమస్యలు మొదలయ్యాయి. అమెరికాకు చెందిన మహిళ నిత్యానంద తనను గత 5 సంవత్సరాలుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని విలేకరుల సమావేశంలో ఆరోపించడంతో ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. ఆయనపై పోలీసులు అరెస్టు వారెంటు జారీ చేసిన తర్వాత అతని కోసం ఉన్నతాధికారుల బృందం, పోలీసులు తీవ్రంగా గాలించారు. చివరకు తానే స్వయంగా లొంగిపోయాడు.

మహిళా అథ్లెట్ పింకీపై రేప్ కేసు!



కోల్‌కతా, జూన్ 14: భారత మహిళా అథ్లెట్ పింకీ ప్రామాణిక్‌పై రేప్ కేసు నమోదైంది. అత్యంత ఆశ్చర్యకరంగా, పింకీ మహిళ కాదని, పురుషుడనీ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బ్రాగుటీ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఎంతోకాలంగా తనతో ప్రేమ వ్యవహారం నడిపిన పింకీ పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి మోసం చేసినట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. తనను బలాత్కరించినట్టు ఆరోపించింది. పింకీ 2006లో జరిగిన దోహా ఏసియాడ్‌లో 4న400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించింది. అదే ఏడాది మెల్బోర్న్ కామనె్వల్త్ గేమ్స్‌లో పాల్గొన్న ఆమె అదే ఈవెంట్‌లో రజత పతకం గెల్చుకుంది. 2006లోనే కొలంబోలో జరిగిన శాఫ్ క్రీడల్లో 400 మీటర్లు, 800 మీటర్ల పరుగుతోపాటు 4న400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించింది. ప్రతిభగల అథ్లెట్‌గా గుర్తింపు పొందిన పింకీ మహిళ కాదని ఇప్పుడు ఫిర్యాదు అందడంతో ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పింకీ మహిళ కాదని, తప్పుడు సర్ట్ఫికెట్లతో మహిళల విభాగంలో పోటీపడినట్టు రుజువైతే కఠిన చర్యలు తప్పవని భారత అథ్లెటిక్ సమాఖ్య స్పష్టం చేసింది. కాగా, పింకీపై కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి కాదు. 2004 నవంబర్ 22న నాదియాలో కొంతమంది స్థానికులు ఆమె బ్యాగును తస్కరించారు. అందులో తుపాకీ కనిపించడంతో ఈ విషయాన్ని పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో ఆమెపై అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు కేసు నమోదైంది. ఇంతకీ పింకీ మహిళనా లేక పురుషుడా అన్నది తేలాల్సి ఉంది. బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు రుజువైతే, మన దేశంలో ఒక పురుషులు తప్పుడు సమాచారమిచ్చి మహిళల విభాగంలో పోటీ పడిన తొలి కేసుగా నమోదవుతుంది.
ఇలావుంటే, పింకీలో పురుషులకు ఉండే హార్మోన్లు ఎక్కువగా ఉన్నాయని బెంగాల్ అథ్లెటిక్స్ సంఘం అధికారులు తెలిపారు. దోహా ఆసియా గేమ్స్ తర్వాత ఆమె అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. పురుషుల హార్మోన్లు ఎక్కువ ఉన్నంత మాత్రాన ఒక మహిళా అథ్లెట్‌ను పోటీ నుంచి తొలగించడంగానీ, మహిళల విభాగంలో పోటీ చేయరాదని నిషేధించడంగానీ జరగదని స్పష్టం చేశారు.

ప్రత్తిపాడు, మాచర్లలో వైఎస్ఆర్ సీపీ గెలుపు


గుంటూరు : గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, మాచర్ల స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ప్రత్తిపాడు వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత, మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘన విజయం సాధించారు. అలాగే పోలవరం అభ్యర్థి బాలరాజు గెలుపొందారు. ప్రత్తిపాడు, మాచర్ల, పోలవరంలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది.

వైయస్ జగన్ పార్టీ లీడ్‌లో ఉన్న స్థానాలు ఇవే


శుక్రవారం, జూన్ 15, 2012, 10:30 [IST]

 Bypolls Seats Leading Ysrcp
హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధిక్యంలో ఉన్న స్థానాలు - నర్సన్నపేట, పాయకరావుపేట, పోలవరం, ప్రత్తిపాడు, మాచర్ల, ఒంగోలు, ఉదయగిరి, తిరుపతి, అనంతపురం అర్బన్, రాయదుర్గం, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు, రామచంద్రాపురంలో కాంగ్రెసు అభ్యర్థి తోట త్రిమూర్తులు ఆధిక్యంలో ఉన్నారు. పరకాలలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధిక్యంలో కొనసాగుతోంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెసు రెండు స్థానాల్లో, టిడిపి ఒక స్థానంలో కూడా ఆధిక్యంలో లేదు. తొలుత రామచంద్రాపురంలో ఆధిక్యంలో కొనసాగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆ తర్వాత కాంగ్రెసుపై వెనకబడిపోయింది.
రామచంద్రాపురం, తిరుపతి, ఉదయగిరి వంటి స్థానాల్లో కాంగ్రెసు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కాంగ్రెసు గట్టి పోటీ ఇస్తోంది. రామచంద్రాపురంలో కాంగ్రెసు అభ్యర్థి తోట త్రిమూర్తులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. తిరుపతిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి, కాంగ్రెసు అభ్యర్థి వెంకటరమణకు మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొని ఉంది.
తెలంగాణలోని పరకాల శాసనసభా నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆధిక్యంలో కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ రెండో స్థానంలో కొనసాగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొండా సురేఖ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. తెరాసకు సవాల్ విసిరి బరిలోకి దిగిన బిజెపి నాలుగో స్థానంలో ఉంది.
నెల్లూరు లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి, కాంగ్రెసు అభ్యర్థి టి. సుబ్బిరామిరెడ్డిపై 11 వేల ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఉదయగిరి శాసనసభా స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర రెడ్డి కేవలం 405 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. నర్సాపురం, తిరుపతి స్థానాల్లో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు మధ్య హోరాహోరీగా పోరు కొనసాగుతుంది.
ఉప ఎన్నికల్లో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హవా కొనసాగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెసు పార్టీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే, తిరుపతిలో మాత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డికి, కాంగ్రెసు అభ్యర్థి వెంకటరమణ మధ్య పోరు హోరాహోరీగా ఉంది.
కాగా, పరకాలలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి బిక్షపతి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలోకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వచ్చింది. చాలా చోట్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మధ్యనే పోరు కొనసాగుతోంది. ఆళ్లగడ్డలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శోభానాగి రెడ్డి ఆధిక్యంలో ఉంది. రాయదుర్గంలో కూడా వైయస్సార్ కాంగ్రెసు ఆధిక్యంలో ఉంది. నెల్లూరు లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఈ నెల 12వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. శుక్రవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 18 శాసనసభా నియోజకవర్గాలకు, ఓ లోకసభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధిక స్థానాలు గెలుస్తుందనే అంచనాలు సాగుతున్నాయి.

రామ్ చరణ్ పెళ్లిపై అమితాబ్ ట్విట్టర్ కామెంట్


శుక్రవారం, జూన్ 15, 2012, 12:14 [IST]

amitabh comments about ramcharan rich wedding
ఆ ట్వీట్ లో....పెళ్లి నుంచి తిరిగి వచ్చాను. దేశంలో ఏ ప్రాంతంలో అయినా భారతీయ సాంప్రదాయ లతో కూడిన ఈవెంట్స్ చాలా మనోహరమైన ఉంటాయి. మన సంస్కృతి చాలా సంపర్నమైనది అంటూ ట్వీట్ చేసారు. ఆయన ఈ ట్వీట్ లో రామ్ చరణ్ పేరు ప్రస్దావించకపోయినా ఈ పెళ్లి గురించే అని తెలిసిందే. ఆయన ఈ పెళ్లిని బాగా ఎంజాయ్ చేసినట్లు సమాచారం.
ప్రముఖ సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు కొణిదెల చిరంజీవి కుమారుడు హీరో రాంచరణ్ తేజ, ప్రముఖ వ్యాపారవేత్త అపోలో ప్రతాప్‌రెడ్డి మనుమరాలు కామినేని ఉపాసనల పెళ్లి గురువారం ఉదయం హైదరాబాద్ శివారు ప్రాంతమైన మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌ లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సినీ ప్రముఖులు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, సూపర్‌స్టార్ రజనీకాంత్, డి.రామానాయుడు, కె.రాఘవేంద్రరావు, మోహన్‌బాబు దంపతులు వచ్చారు.

అలాగే వెంకటేష్, జమున, శ్రీదేవి, బోనీకపూర్, మురళీమోహన్, పరుచూరి బ్రదర్స్, శత్రఘ్నసిన్హా, రాధిక, సుహాసిని, జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, అంబరీష్, సుమలత, రానా, శ్రీయ, కోడి రామకృష్ణ, కోదండరామిరెడ్డి, ముత్యాల సుబ్బయ్య, ఎస్వీ కృష్ణారెడ్డి, వీవీ వినాయక్, శ్రీనువైట్ల, జయంత్ సి.పరాన్జీ, బోయపాటి శ్రీను, పైడిపల్లి వంశీ, శ్రీకాంత్ దంపతులు, సి.అశ్వనీదత్, ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, కె.అచ్చిరెడ్డి, దిల్‌రాజు, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, బూరుగుపల్లి శివరామకృష్ణ, కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం తదితరులు వచ్చి తమ ఆశ్వీవచనాలను అందచేసారు.

గురువారం రాత్రి హైటెక్స్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో రిసెప్షన్ ఘనంగా జరిగింది. రిసెస్షన్‌కు స్పీకర్ నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదీ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ దంపతులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ నటులు నాగార్జున దంపతులు, మహేష్‌బాబు దంపతులు, ప్రభాస్, పూరి జగన్నాథ్ దంపతులు, జయప్రద, బాలకృష్ణ భార్య వసుంధర తదితరులు హాజరయ్యారు.

తారాస్థాయికి టెన్షన్లు .. కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్


    ఏలూరు, జూన్ 14: జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ప్రాతినిధ్యం వహించడానికి ఇద్దరికి అధికారం కట్టబెడుతూ ప్రజలిచ్చిన తీర్పు వెలువడటానికి మరికొద్ది గంటలు మాత్రమే గడువు ఉంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో భద్రంగా ఉన్న ఓట్ల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. నర్సాపురం, పోలవరం అసెంబ్లీ సిగ్మెంట్ల నుండి పోటీ పడిన అభ్యర్ధుల్లో టెన్షన్ ప్రారంభమైంది. నర్సాపురం నుండి తొమ్మిదిమంది, పోలవరం నుండి ఆరుగురు పోటీపడగా వీరందరి భవితవ్యం శుక్రవారం వెల్లడికానుంది. ఓట్ల లెక్కింపు కార్యక్రమం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రమైన ఏలూరులో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఈసారి కూడా త్రిముఖ పోటీ ఉండటంతో ఖచ్చితంగా తాను విజయం సాధించగలనని ఏ ఒక్క అభ్యర్ధి కూడా ధీమా వ్యక్తం చేయలేని పరిస్ధితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రజాశాంతి, సిపిఎం పార్టీలతోపాటు పలువురు ఇండిపెండెంట్ అభ్యర్ధులు కూడా పోటీలో ఉన్నారు. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ప్రధాన పోటీ కాంగ్రెస్-తెలుగుదేశం-వైఎస్సార్‌సిపిల మధ్యే నెలకొని ఉంది. వివిధ సమీకరణాలు, వెన్నుపోట్లు బేరీజు వేసుకుంటూ గెలుపు తమదేనని మూడు పార్టీల అభ్యర్ధులు మేకపోతు గాంభీర్యం వ్యక్తం చేస్తున్నప్పటికీ లోలోపల మాత్రం అందరిలోనూ కనపడని గుబులు వ్యక్తమవుతోంది. కొంతమంది అభ్యర్ధులు కోట్లాది రూపాయలు వ్యయం చేసినా వారిలో సైతం గెలుపు ధీమా వ్యక్తం కావటం లేదు. ఎవరికివారు తమ పరిధిలో కూడికలు, తీసివేతల్లో నిమగ్నమయ్యారు. ఈ రెండు స్ధానాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు, కడప ఎంపి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి సొంతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్ధాపించటంతో ఒక్కసారిగా రాజకీయ పరిస్దితుల్లో మార్పు వచ్చింది. ఆయనకు మద్దతుగా ఈ రెండు నియోజకవర్గాల సిట్టింగ్ ఎమ్మెల్యేలు వ్యవహరించటం వారిపై అనర్హత వేటు పడటంతో ఈ ఉపఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. గతంలో కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీల మధ్యే నువ్వా-నేనా అన్న రీతిలో పోటీ నెలకొంటూ ఉండగా గత ఎన్నికల్లో పీఆర్పీ కూడా రంగంలోకి దిగటంతో రాజకీయసమీకరణాలతోపాటు వర్గ సమీకరణాల్లో కూడా మార్పు కొట్టొచ్చినట్లు కన్పించింది. అయితే పిఆర్పీ కూడా కాంగ్రెస్‌లో విలీనం కావటం, కొత్తగా వైఎస్సార్‌సిపి ఆవిర్భవించి జిల్లాలో బోణి కొట్టాలని కృతనిశ్చయంతో ఉండటంతో ఎవరికివారు ఈ రెండు స్ధానాలు దక్కించుకోవాలని సర్వశక్తులు ఒడ్డారు. అయితే ప్రతిసారి వైవిధ్యభరితమైన తీర్పును ఇస్తూ అటు రాజకీయపరిశీలకులను కూడా ఆశ్చర్యచకితులను చేసే ఈ రెండు నియోజకవర్గాల ఓటరు దేవుళ్ల కరుణ ఈసారి ఎవరిపై పడిందోనని అభ్యర్ధులంతా ఎదురుతెన్నులు చూస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్ధులందరూ అనుభవజ్ఞులైన వారినే కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించుకున్నారు. ఏలూరులోనే రెండు నియోజకవర్గాల కౌంటింగ్ జరగనుండటంతో అభ్యర్ధులంతా పెద్దఎత్తున అనుచరులతో ఏలూరు తరలివచ్చేందుకు భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. గురువారం రాత్రికే చాలామంది ఏలూరు చేరుకున్నారు. దీంతో ఏలూరులోని అన్ని ప్రముఖ హోటళ్లు, లాడ్జిల రూములన్నీ ఇప్పటికే పార్టీల అభ్యర్ధులు, నాయకుల పేరిట రిజర్వు అయిపోయాయి. అయితే కౌంటింగ్ కేంద్రాల్లో సెల్‌ఫోన్లు నిషేధించటంతో అభ్యర్ధులు ఒకింత నిరాశకు లోనైయ్యారు. నిముషనిముషానికి ఫలితాలు తెలుసుకుని తమ బంధువులు, అనుచరులతో ఆనందాన్ని పంచుకోవాలనుకున్న అభ్యర్ధులు ఈ నిర్ణయంతో హతాశులయ్యారు. లెక్కింపు కార్యక్రమం దగ్గరపడుతున్న కొద్ది జిల్లాలో పందాల జోరు కూడా తారాస్ధాయికి చేరుకుంది.
బారికేడ్ల ఏర్పాటులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన
అర్‌అండ్‌బి డిఇపై కలెక్టర్ ఆగ్రహం
ఏలూరు, జూన్ 14: వట్లూరు పాలిటెక్నిక్ కళాశాల వద్ద శుక్రవారం నిర్వహించనున్న ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా బారికేడ్ల ఏర్పాటులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అర్‌అండ్‌బి డిఇ వీర అర్జునరావుపై కలెక్టరు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగా పనులు చేయాల్సిన అధికారులు ఈవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించటం సహించబోనని, ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద యుద్దప్రాతిపదికన బారికేడ్లు ఏర్పాటుచేయాలని ఆదేశించారు.
వట్లూరులోని సర్ సిఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టరు తెలిపారు. జిల్లా ఎస్పీ ఎం రమేష్‌తో కలిసి ఆమె వాహనాల పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి వంద మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేయటం జరుగుతుందన్నారు. కౌంటింగ్‌కు వచ్చే అభ్యర్ధులు, ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బంది తమ వాహనాలను ఇంజనీరింగ్ కళాశాలలో పార్కింగ్ చేసుకోవచ్చునన్నారు. కలెక్టరు వెంట అదనపు ఎస్పీ సత్యనారాయణ, అదనపు జెసి ఎంవి శేషగిరిబాబు, డిఆర్వో మోహనరాజు, ఆర్డీవోలు కె నాగేశ్వరరావు, సత్యనారాయణ, వసంతరావు, సూర్యారావు తదితరులు ఉన్నారు.
నేడే కౌంటింగ్
ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
ఏలూరు, జూన్ 14: జిల్లాలో ఉప ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టరు డాక్టరు జి వాణిమోహన్ తెలిపారు. ఓట్ల లెక్కింపు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.
* జిల్లాలో నర్సాపురం, పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 15మంది అభ్యర్ధులు పోటీపడ్డారు.
* నర్సాపురం నియోజకవర్గంలో మొత్తం 141834 మంది ఓటర్లకుగాను 124208మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
* పోలవరం నియోజకవర్గంలో మొత్తం 172189 మంది ఓటర్లకుగాను 149966మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.
* ఒక్కొక్క నియోజకవర్గానికి 14 చొప్పున టేబుళ్లను ఓట్ల లెక్కింపునకు వినియోగిస్తున్నారు.
* 56మంది కౌంటింగ్ సిబ్బందిని, మైక్రో అబ్జర్వర్లను నియమించారు.
* శుక్రవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ మొదలుకాగానే తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. రెండు అసెంబ్లీ నియోజకవర్గాల బ్యాలెట్ పత్రాలను సంబంధిత నియోజకవర్గాల టేబుళ్ల మీద లెక్కిస్తారు. * బ్యాలెట్ పత్రాల లెక్కింపునకు సుమారు అరగంట సమయం పడుతుందని భావిస్తున్నారు. అనంతరం 8.30గంటలకు ఈవిఎంలలో ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.
* ఒక్కో టేబుల్ వద్ద అభ్యర్ధి తరపున ఒక్కో ఏజెంటు ఉంటారు.
* ప్రతి టేబుల్ దగ్గర అధికారులపరంగా కౌంటింగ్ పర్యవేక్షకుడు, సహాయకుడితోపాటు సూక్ష్మ పరిశీలకుడు ఉంటారు. ప్రతి రౌండ్‌లోనూ ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు.
* ఓట్ల లెక్కింపు సిబ్బంది ఏ నియోజకవర్గంలో, ఏ టేబుల్ వద్ద ఉంటారనేది శుక్రవారం ఉదయం 5గంటలకు జిల్లా కలెక్టరు, ఎన్నికల పరిశీలకుల సమక్షంలో కంప్యూటర్ ద్వారా నిర్ణయిస్తారు.
* ప్రతి నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్ అధికారి ఉంటారు. అయన టేబుల్ వద్ద అభ్యర్ధితో పాటు నియోజకవర్గ పరిశీలకుడు ఉంటారు.
* అభ్యర్ధులు, ఎన్నికల ఏజెంట్లు, లెక్కింపు సిబ్బంది కూడా శుక్రవారం ఉదయం 7గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు రావాలి. అతర్వాత వచ్చేవారినెవర్ని అనుమతించే అవకాశం లేదని కలెక్టరు స్పష్టం చేశారు.
* ఆయా నియోజకవర్గాల్లో ఒకటో పోలింగ్ కేంద్రం నుంచే లెక్కింపు మొదలవుతుంది.
* ప్రతి రౌండ్‌కు ఎన్నికల పరిశీలకులు రాండమ్‌గా రెండు ఈవిఎంలను రీకౌంటింగ్ చేస్తారు. ఒక వేళ ఏదైనా తేడా వస్తే అక్కడి కౌంటింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటారు. వెంటనే కొత్త సిబ్బందిని నియమిస్తారు.
* ప్రతి కౌంటింగ్ హాలులోనికి 14+1 మంది కౌంటింగ్ ఏజెంట్లను అనుమతిస్తారు.
* మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియోగ్రఫి చేయిస్తారు.
* ఒక్కో అసెంబ్లీ సిగ్మెంట్‌కు ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసిఐఎల్) నుంచి వచ్చిన ఒక్కో ఇంజనీరును కేటాయించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంలో ఏదైనా సాంకేతిక సమస్య ఏర్పడిన వెంటనే వారు సరిచేస్తారు.
* భద్రతాపరంగా మెయిన్‌గేట్ వద్ద ఒక మేజిస్ట్రేట్‌ను ఉంచుతారు. అత్యవసర పరిస్దితుల్లో ఆదేశాలు జారీ చేయడానికి ఈ మేజిస్ట్రేట్ ఉపయోగపడతారు.
* ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల పరిధిలో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు.
భీమవరంలో ఉన్మాది వీరంగం
* దాడిలో మృతిచెందిన మున్సిపల్ ఉద్యోగి* పలువురికి గాయాలు* ఉన్మాదికి స్థానికుల దేహశుద్ధి
భీమవరం, జూన్ 14: భీమవరంలో ఉన్మాది కత్తితో వీరంగం చేశాడు. పలువురు గాయపడడంతో పాటు ఒక మున్సిపల్ ఉద్యోగి మృత్యువాత పడ్డాడు. స్థానిక నాచువారి సెంటర్లో గురువారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. వీరంగం చేసిన ఉన్మాదికి స్థానికులు దేహశుద్ధి చేసి ట్రక్కులో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఒంటినిండా గాయాలు, తలపై బలమైన గాయాలతో భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్మాది శ్రీను చికిత్స పొందుతున్నాడు. మృతిచెందిన మున్సిపల్ ఉద్యోగి షేక్ మీరాసాహెబ్ (57)గా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి పోలీసులు హుటాహుటిన తరలి వెళ్ళారు. మృతదేహాన్ని వన్‌టౌన్ సిఐ కె.రమణారావు పరిశీలించారు. ఉన్మాది శ్రీను గతంలో ఇదే విధంగా దాడికి పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. ఉన్మాది చేసిన దాడిలో గాయపడ్డ పలువురి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. స్థానిక నాచువారి సెంటర్లోని ఒక సిమెంటు దుకాణంలో ట్రక్కు డ్రైవర్‌గా శ్రీను పనిచేస్తున్నాడు. అయితే కొన్ని సందర్భాల్లో మతిస్థిమితం సరిగా లేక ఎవరిపైన పడితే వారిపైన దాడి చేస్తాడని స్థానికులు తెలిపారు. ఏం జరిగిందో తెలియదు గానీ ఒక్కసారిగా శ్రీను సమీపంలో ఉన్న కొబ్బరి బొండాలు అమ్మే దుకాణం వద్ద ఉన్న కత్తి తీసుకుని వీరంగం చేయడం ప్రారంభించాడని పోలీసులు తెలిపారు. స్థానిక పద్మాలయ థియేటర్ వద్ద దివ్యశ్రీ మెస్ సమీపంలో నివశిస్తున్న షేక్ మీరాసాహెబ్ (57) పిఎస్‌ఎం గరల్స్ హైస్కూలులో నైట్ వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అతని కుమారుడు షేక్ అక్బర్ తండ్రిని తీసుకుని సాయంత్రం 5 గంటల సమీపంలో పాఠశాల వద్దకు తీసుకువెళ్ళి విడిచివెళ్లాడు. అక్బర్ స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే శ్రీను కత్తితో వీరంగం చేసిన సమయంలో అటుగా వెళ్తున్న ఒక యువతి, మరో యువకుడిపై దాడిచేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే వారి వివరాలు తెలియాల్సి వుందన్నారు. వారిపై దాడి చేసిన తరువాత పాఠశాల సమీపంలో ఉన్న నైట్ వాచ్‌మైన్ షేక్ మీరాసాహెబ్‌పై కత్తితో దారుణంగా దాడిచేశాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు వెంటనే వెళ్ళి కత్తితో వీరంగం చేస్తున్న శ్రీనుకు దేహశుద్ధి చేశారు. ఇంతలో కొన ఊపిరితో ఉన్న మున్సిపల్ ఉద్యోగి షేక్ మీరాసాహెబ్‌ను 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న షేక్ మీరాసాహెబ్ భార్య షేక్ నబీన్ బీబీ, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని భోరున విలపించారు. వన్‌టౌన్ సిఐ కె.రమణారావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. వన్‌టౌన్ ఎస్సై డి.వెంకటేశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
కోట్లకు పైగా సాగిన పందాలు
అభ్యర్థులతో ఎంతమంది గల్లంతో
ఏలూరు, జూన్ 14: శాసనసభ ఉపఎన్నికల్లో అభ్యర్ధుల గెలుపుపై భారీగా పందాలు సాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా విచిత్రమైన రీతిలో ఈసారి పందాలు సాగటం గమనార్హం. ఫలానా అభ్యర్ధి విజయం సాధిస్తాడని, ఓడిపోయే అభ్యర్ధులు రెండు, మూడు స్ధానాల్లో ఏది సాధిస్తారన్న దానిపై కూడా పందాలు సాగటం విశేషం. అదీకాకుండా ఫలానా పార్టీకి జిల్లాలో ఎన్ని సీట్లు వస్తాయి, ప్రత్యర్ధి పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి తదితర అంశాలు ఆధారంగా కూడా పందాలు సాగాయి. క్రికెట్ బెట్టింగ్‌కు మించి ఈసారి రాజకీయ పందాల జోరు కొనసాగింది. ఫలానా ప్రాంతంలో తమపార్టీ అభ్యర్ధికి ఇన్ని ఓట్ల మెజార్టీ వస్తుందని కూడా పందాలరాయుళ్లు పందాలు కాసారు. జిల్లాలో ఎప్పటిమాదిరిగానే ధనవంతులను బికారులుగా మార్చేంతగా కోట్లాది రూపాయల పందాలు సాగాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కొంతమంది వ్యక్తులు కార్లలో డబ్బు తెచ్చి మరీ కోట్ల రూపాయల మేర పందాలు కాస్తుండటంతో పరిస్ధితి తీవ్రస్దాయికి చేరింది. ధనవంతుల సంగతి పక్కనపెడితే మధ్యతరగతి వ్యక్తులు ఈ వ్యసనం వల్ల బికారులుగా మారే ప్రమాదం పొంచి ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కొంతకాలంగా తాము సంపాదించిన మొత్తాన్ని పందాలలో ఒడ్డుతున్నారు. ఫలితం తారుమారు అయితే అటువంటి వారంతా రోడ్డున పడటం ఖాయం. జిల్లాలో ఉపఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటినుండే మరే ప్రాంతంలో జరగని రీతిలో పలుచోట్ల పందాలు కోట్ల రూపాయల్లో జరిగిపోతున్నాయి. ఏ ప్రాంతంలో చూసినా ఫలానా అభ్యర్ధి గెలుస్తాడు, మీ వారు ఎవరైనా పందాలు కాస్తారా అంటూ కొంతమంది వ్యక్తులు పని గట్టుకుని మరీ పందాలను ప్రోత్సహిస్తున్నారు. మరికొంతమంది అయితే అ పార్టీ అభ్యర్ధి మూడవ స్ధానంలో నిలుస్తాడని 50లక్షల రూపాయల వరకు పందెం ఉంది, ఎవరైనా పందెం కాసేవారు ఉంటే తమకు తెలియజేయాలని కిళ్లీషాపు యజమానులు, కాఫీహోటళ్ల యాజమానులకు చెప్పి పోతున్నారు. వారికి తమ సెల్‌ఫోన్ నెంబర్లు ఇచ్చి పందెం కాసే వారు ఎవరైనా వస్తే అ నెంబరుకు ఫోన్ చేయాలని చెప్పి వెళుతున్నారు. ప్రధానంగా కడప ఎంపి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్ధాపించిన వైఎస్సార్‌సిపిపై ఈసారి భారీస్ధాయిలో పందాలు జరిగాయి. రెండు నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్‌సిపి అభ్యర్ధులపై లక్షల రూపాయల మేర పందాలు కొనసాగాయి. జిల్లా కేంద్రానికి సమీపంలోని ఒక ప్రజాప్రతినిధి పోలవరంలో వైఎస్సార్‌సిపి అభ్యర్ధి విజయం సాధిస్తారని దాదాపుగా 40 లక్షల రూపాయలు పందెం కాసారంటే పరిస్దితి అర్ధం చేసుకోవచ్చు. ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి మూడవ స్దానంలో ఉంటారని కొంతమంది వ్యక్తులు లక్షల రూపాయల్లో పందాలు కాసారు. తమ పందెం 80వేలు అయితే పందెం కాసేవారు లక్ష రూపాయలు ఇవ్వాలని షరతు పెట్టి మరీ పందాలు కాయటం విశేషం. ఉభయగోదావరి జిల్లాలోని నర్సాపురం, పోలవరం, రామచంద్రాపురం కలుపుకుంటే దాదాపు వంద కోట్ల రూపాయల పందాలు జరిగాయని అంచనా. హైదరాబాద్, కృష్ణా, గుంటూరు, ఖమ్మం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నుండి ప్రముఖులు జిల్లాలోని రెండు అసెంబ్లీ సిగ్మెంట్ల నుంచి పోటీ చేసిన అభ్యర్ధులపై కోట్లాది రూపాయల పందాలు కాసారు. నర్సాపురం నియోజకవర్గంలో తొలుత వైఎస్సార్‌సిపి అభ్యర్ధిపై భారీ పందాలు కాసినవారు పోలింగ్ పూర్తయిన తర్వాత గాలి మారిందన్న ఉద్దేశ్యంతో పందాలు మార్చేందుకు అవకాశం లేకపోవటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిపైన కూడా అంతకుముందు కాసిన మొత్తానికే పందాలు కాయటం విశేషం. ఒకటికి రెండు రెట్ల రీతిలో పందాలు జరిగాయి. అదేవిధంగా జిల్లాలోని రెండు అసెంబ్లీ స్ధానాలు వైఎస్సార్‌సిపికి వస్తాయని దాదాపు 20కోట్ల రూపాయల వరకు పందాలు జరిగినట్లు సమాచారం. ఇక అధికార పార్టీకి నర్సాపురం స్ధానం తప్పకుండా వస్తుందని మరో 20 కోట్ల కోట్ల రూపాయల వరకు పందాలు జరిగాయి. ఇక పోలవరం నియోజకవర్గానికి వస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి విజయం సాధిస్తారని కోట్ల రూపాయల్లోనే పందాలు జరిగాయి. మరోవైపు జిల్లాలో పలుచోట్ల పందాల కోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటుచేశారు. అదేవిధంగా చేపల చెర్వులు, వ్యవసాయభూములను కూడా పందాలు కాసారు. ఒకప్రక్క ఎవరు నెగ్గుతారో చెప్పలేకుండా ఉన్నామంటూనే పందెం ప్రియులు కోట్లాది రూపాయలను పందాలుగా కాయటం విశేషం. మధ్యతరగతికి చెందిన వ్యక్తులు ఈసారి వేలంవెర్రిగా లక్షల రూపాయల్లో పందాలు కాసారు. లక్ష రూపాయలు లోపు పందెం కాస్తే నామోషీగా భావించి పదిమంది కలిసి రెండు లక్షల రూపాయలను పోగుచేసి పందాలు కాస్తున్నారు. పందెం గెలిస్తే ఫర్వాలేదుగాని ఫలితం ఏమాత్రం ప్రతికూలంగా వచ్చినా వీరిలో చాలామంది రోడ్డున పడేలా ఉన్నారు. కౌంటింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్ది పందాల జోరు ఏమాత్రం తగ్గకపోవటం గమనార్హం. కొంతమంది ఇప్పటికీ నగదు పట్టుకుని వాహనాల్లో తిరుగుతూ పందెం కాస్తావా అంటూ ప్రత్యేకంగా అడుగుతుండటం విశేషం.
ఆ పోలింగ్ స్టేషన్లపైనే అందరి దృష్టి
ఏలూరు, జూన్ 14: ఉపఎన్నికలు జరిగిన నర్సాపురం, పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 90శాతం పైబడి పోలింగ్ జరిగిన పోలింగ్ స్టేషన్లపైనే అందరి దృష్టి నిల్చి ఉంది. అభ్యర్ధుల విజయంలో ఈ పోలింగ్ స్టేషన్లు మలుపుతిప్పే అవకాశం ఉండటంతో ఇప్పుడు వీటిపైనే చర్చ జరుగుతోంది. ఇలాంటి పోలింగ్ స్టేషన్లు గతంతో పోల్చుకుంటే వీటి సంఖ్య పెద్దగానే పెరిగింది. కొందరు అభ్యర్ధులు ప్రత్యేకంగా కృషి చేయటం వల్లే సంబంధిత పోలింగ్ స్టేషన్లలో ఊహాతీతంగా పోలింగ్ పెరిగిపోయింది. తమకు పట్టు ఉన్న పోలింగ్ స్టేషన్లలో భారీఎత్తున పోలింగ్ జరగటం వల్ల తమ విజయావకాశాలు గణనీయంగా మెరుగుపడినట్లేనని కొందరు అభ్యర్ధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నర్సాపురం నియోజకవర్గం పరిధిలో 90శాతం పైబడి పోలింగ్ జరిగిన పోలింగ్ స్టేషన్లు 50కు పైబడి ఉన్నాయంటే అక్కడ ఏమేరకు పోలింగ్ జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఎన్నికలలో ఫలితం ఉత్కంఠగా మారిన నేపధ్యంలో ఏ అభ్యర్ధికైనా మెజార్టీ అతితక్కువగా ఉండే అవకాశం ఉండటంతో 90శాతం పైబడి పోలింగ్ జరిగిన స్టేషన్లపై ఇప్పుడు అందరి దృష్టి మరలింది. 90శాతం పైబడి పోలింగ్ జరిగిన స్టేషన్లలో ఓట్లన్నీ దాదాపుగా ఒకవైపే ఉండవచ్చునని కొందరి భావన. దీనికి కారణంగా సంబంధిత పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలలోనే భారీ పోలింగ్ జరిగింది. ఈవిధంగా పోలింగ్‌స్టేషన్ల వారీగా పార్టీలు లెక్కలు వేసుకుని విజయావకాశాలను అంచనా వేసుకుంటున్నారు. ప్రధానంగా ఈసారి నర్సాపురం నియోజకవర్గంలో పోటీపై ఎక్కువ ఉత్కంఠ నెలకొని ఉండటంతో 90శాతం పైబడి పోలింగ్ జరిగిన పోలింగ్ స్టేషన్లను గుర్తించి అక్కడి నాయకులు, పార్టీ క్యాడర్‌తో సమీక్షలు నిర్వహించి కొంతమంది అభ్యర్ధులు తమ విజయావకాశాలను లెక్కించుకుంటున్నారు. ఈ పోలింగ్ స్టేషన్ల వివరాలు సేకరించిన నేతలు అయా ప్రాంతాల్లో తమ పార్టీకి ఉన్న ప్రాబల్యం, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుని లెక్కలు వేస్తున్నాయి. వీటి ఆధారంగా తమకున్న విజయావకాశాలను బేరీజు వేసుకుని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పోలింగ్ స్టేషన్లలో కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్‌సిపిలకు కూడా భారీగానే ఓట్లు పోల్ అయ్యాయని, ఈకారణంగా ఫలానా అభ్యర్ధికి ఏకమొత్తంగా ఓట్లు పడ్డాయని తేల్చలేమని రాజకీయ విశే్లషకులు పేర్కొంటున్నారు. మొత్తంమీద నర్సాపురంలో ఈ పోలింగ్ స్టేషన్లపైనే ప్రధాన చర్చ జరగటం విశేషం. ఇక రసవత్తర పోరుకు వేదికగా మారిన పోలవరం నియోజకవర్గంలో కూడా 90శాతానికి పైగా పోలింగ్ జరిగిన పోలింగ్ స్టేషన్లు చాలా ఉన్నాయి. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో నమోదైన పోలింగ్ కన్నా ఇక్కడ ఈ ఉపఎన్నికల్లో ఎక్కువశాతం పోలింగ్ నమోదు కావటం గమనార్హం. ఇక్కడ కూడా మూడు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉండటంతో 90శాతం పైబడి పోలింగ్ జరిగిన పోలింగ్ స్టేషన్ల వివరాలు సేకరించిన నేతలు ఎక్కడెక్కడ ఏఏ పార్టీకి అధిక ఓట్లు పడ్డాయన్న అంశంపై అంచనాలు వేస్తున్నాయి. వీటి ఆధారంగానే గెలుపు అవకాశాలు ఆధారపడి ఉంటాయని భావించి అయా పోలింగ్ స్టేషన్లలో మొత్తం ఓట్లు, సామాజికపరంగా ఉన్న ఓట్లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ లెక్కలు కడుతున్నారు. ముఖ్యంగా ఒకే వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న పోలింగ్ స్టేషన్లలో ఏకమొత్తంగా ఏ పార్టీకి ఓట్లు పడ్డాయన్న అంశంపై నేతలు దృష్టి పెట్టారు. నియోజకవర్గ పరిధిలోని అయిదుమండలాల్లో ఎక్కువశాతం పోలింగ్ జరిగిన పోలింగ్ స్టేషన్ల వివరాల ఆధారంగా ఏఏ పార్టీకి అక్కడ మెజార్టీ వస్తుంది అన్న అంశంపై లెక్కలు వేస్తున్నారు. ఈవిధంగా రెండు నియోజకవర్గాల పరిధిలో భారీగా పోలైన పోలింగ్ స్టేషన్లపై ప్రధాన పార్టీలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఎవరి లెక్కలు సరిపోయాయన్నది ఓట్ల లెక్కింపు అనంతరమే తేలుతుంది.
ఒకవైపు లబ్‌డబ్ అయినా విజయోత్సవాలకు సిద్ధం
ఏలూరు, జూన్ 14: ఉప ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్ధులు విజయం మీద ధీమాతో అప్పుడే విజయోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల సంఘం విధించిన ఆంక్షల కారణంగా నానా ఆగచాట్లు పడ్డ అభ్యర్ధులు విజయం సాధించిన తర్వాత మాత్రం తమ సత్తా చూపేందుకు ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నారు. 15వ తేదీ మధ్యాహ్నం 11-12గంటలకు ఫలితాలు మొత్తం వెలువడే అవకాశం ఉండటంతో అతర్వాత నుంచి విజయోత్సవాలు నిర్వహించుకునేందుకు కొంతమంది అభ్యర్ధులు భారీ ప్రయత్నాలే చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ ఉపఎన్నికలు హోరాహోరీగానే కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్‌సిపిల మధ్య పోరు తీవ్రంగా ఉండటంతో ఏ అభ్యర్ధికి విజయం దక్కుతుందన్నది చెప్పలేకుండా మారింది. అయినప్పటికీ అభ్యర్ధులు ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పది వేల మెజార్టీతో గెలుస్తామంటూ కొందరు మెజార్టీని అంకెలతో సహా చెపుతున్నారు. దీని ఆధారంగా తమ గెలుపు సునాయాసమని భావిస్తున్న అభ్యర్ధులు ఫలితాలు వెలువడిన వెంటనే సంబరాలు జరుపుకునేందుకు సిద్దపడుతున్నారు. పోలవరం నియోజకవర్గంలో అయితే మూడు పార్టీలకు చెందిన అభ్యర్ధులు విజయోత్సవాలకు ఏర్పాట్లు చేస్తుండటం విశేషం. మరికొంతమంది విజయం సాధించిన అనంతరం నియోజకవర్గంలో కృతజ్ఞతాపూర్వక ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అటు ఓటర్లును కలుసుకోవటంతోపాటు ఇటు తమ అనందాన్ని పంచుకున్నట్లు ఉంటుందని భావిస్తున్నారు. వాస్తవానికి ఈసారి ఉపఎన్నికలు అనూహ్యమైన ఉత్కంఠ మధ్య సాగటంతోపాటు వర్గసమీకరణాల్లో భారీగా మార్పులు చోటుచేసుకోవటం వల్ల ఈ రెండు స్ధానాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తవచ్చునన్న అనుమానాలు లేకపోలేదు. ప్రధానంగా కొన్ని వర్గాలు ఒక పార్టీకి కొమ్ము కాసాయన్న అంచనాల నేపధ్యంలో చివరకు ఈ గెలుపొటములు, అనంతరం జరిగే విజయోత్సవాలు ప్రతీకార కార్యక్రమాలుగా మారతాయన్న అనుమానాలను పోలీసు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అ పరిస్ధితే తలెత్తితే కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం కూడా చోటుచేసుకుంటుందన్న అనుమానాలున్నాయి. గతంలో ఏనాడూ లేనివిధంగా కొన్ని వర్గాల మధ్య పోరాటంగా ఈసారి ఎన్నికలు జరగటంతో పోలింగ్ సమయంలోనే ఉద్రిక్తతలు తలెత్తుతాయన్న అభిప్రాయంతో బందోబస్తును భారీగా చేపట్టారు. అయితే అవి పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్రీకృతం కావటంతోపాటు స్ధానిక పోలీసుస్టేషన్ల పరిధిలో పరిస్దితులను ఎప్పటికప్పుడు అంచనా వేయటం ద్వారా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే విజయోత్సవాల పరిస్ధితి అలా ఉండదన్న అభిప్రాయాన్ని పోలీసు అధికారులతో పాటు కొంతమంది రాజకీయనాయకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. విజయోత్సవంలో కొందరు, ఓటమి పాలైన ఆక్రోశంలో మరికొందరు ఉండటంతోపాటు ఇవి ప్రతీకార కార్యక్రమాలుగా రూపుదిద్దుకుంటే వాటిని అప్పటికప్పుడు అదుపులోనికి తీసుకురావటం కష్టసాధ్యమవుతుందన్న అభిప్రాయం ఉంది. భారీ ర్యాలీలు నిర్వహిస్తే మాత్రం వాటికి తగిన భద్రత ఏర్పాటుచేయటం కూడా ఇబ్బందికరమేనని చెపుతున్నారు. అయినప్పటికీ గతంలో ఏనాడూ ఈతరహా ఉద్రిక్తతలు తలెత్తకపోవటంతో చిన్నతరహాలోనే విజయోత్సవాలు నిర్వహించుకునేందుకు అవకాశం ఇవ్వవచ్చునని భావిస్తున్నారు.
ద్వారకాతిరుమల ఇఒఆర్‌డి అరెస్టు
ద్వారకాతిరుమల, జూన్ 14: మండలంలోని గుణ్ణంపల్లిలో ఒక మహిళ ఇంటివద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన కారణంగా ద్వారకాతిరుమల ఇఒఆర్‌డి శ్రీనివాసును గురువారం అరెస్టు చేసినట్టు ద్వారకాతిరుమల ఎస్సై శీలం శంకర్ తెలిపారు. డోరు నెంబర్ల కేటాయింపు వివాదంలో ఇఒఆర్‌డి శ్రీనివాసుపై గత పలు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో గుణ్ణంపల్లికి చెందిన ఒక మహిళ నాగలక్ష్మి ఇఒఆర్‌డిపై అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై జడ్పీ సిఇఒ విచారణ చేపట్టారు. ఇదిలావుండగా తనపై ఉన్నతాధికారులకు చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలంటూ గత నెలలో ఇఒఆర్‌డి శ్రీనివాసు నాగలక్ష్మి ఇంటికి వెళ్లి పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీనిపై భయపడిన నాగలక్ష్మి ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విచారణ నిర్వహించిన అనంతరం శ్రీనివాసును అరెస్టుచేసినట్టు ఎస్సై తెలిపారు.

Being fat is not sexy: Kareena Kapoor



Being fat is not sexy: Kareena Kapoor
Kareena KapoorMore Pics

While actors like Vidya Balan and Sonakshi Sinha are known for their curves, Kareena Kapoor believes that being big is uncool. She has been on a strict diet for over a month to look lean and sexy for a song she's shooting for an upcoming film.

Says Bebo, "I have gone back to the size-zero look I had in Tashan, but this time it is curvier. I wanted this body for my item song in the film. Since it is a rigorous and raunchy number, I decided to go for a slim and sexy look. But I still have curves in the right places. It may be a trend now with some actors, but I definitely don't want to look plump or fat!"

Vidya and Sonakshi aren't just comfortable with their curves, they're calling it sexy. Bebo retorts, "Being fat is not sexy! Anyone who says that is talking crap. Voluptuous is sexy, but fat is out. Any woman who says she doesn't want to be thin is talking nonsense. It's every girl's dream."

Kareena's dietician Rujuta Diwekar has developed a challenging diet for the actor. Says Kareena, "The key to a sexy figure is a great diet, combined with the right exercise. Rujuta combines fat and protein, and tells me to eat everything in moderation, and every two hours. She keeps changing my diet so that my body doesn't get bored. I recently went to Turkey for eight days and it was more like a health trip. I was training twice a day and was on a strict diet. I ate salads, hummus with pita bread, strawberries and olives. For dinner, I had an Indian cook make daal,rice and sabzi."

It isn't about diets only. The actor says, "I did my regular yoga exercises there too. I do 40 minutes of asanas and 50 surya namaskars."

She has a word of advice for people who go on crash diets like the no-carb diets. "How long can you go without carbohydrates? Some day you will have potato or rice."

How does Saif like the new Kareena? He's always maintained that he likes curves on his ladylove. Says Bebo, "He appreciates the fact that I love the challenge of disciplining myself for a role and how I do it. Saif always gives me the encouragement I need."

Petrol price may be cut by up to Rs 2 a litre soon


oil prices.jpg
Petrol car owners may soon heave a sigh of relief as oil firms are expected to cut petrol prices by up to Rs 2 per litre on Friday due to falling international crude prices.
MUMBAI: Petrol car owners may soon heave a sigh of relief as oil marketing firms are expected to cut petrol prices by up to Rs 2 per litre on Friday due to falling international crude prices. Crude prices, which fell to $96.5 per barrel on Wednesday, the lowest level in the last one year, have provided enough legroom for the oil firms to reduce petrol prices.

State-owned oil marketing firms Indian Oil Corporation (IOC), Hindustan Petroleum Corporation (HPCL) and Bharat Petroleum Corporation (BPCL) will meet on Friday to decide on the quantum of reduction in petrol prices to be passed on to consumers, who suffered the steepest ever petrol price hike of around 10 % last month. This would be the second successive cut in petrol prices after oil firms agreed to roll back petrol prices by Rs 2 on June 2.

Confirming the move, a senior official with India's biggest oil retailer told TOI: "There is scope to reduce petrol prices between Rs 2 and Rs 3 a litre on falling international crude oil prices but the quantum of cut will be ascertained only after adjusting the rupee's fall against the US dollar."

Here's how the arithmetic works. Every dollar reduction in international oil prices translates into a cut in product price by 33 paise. But every time the Indian currency depreciates against the dollar by one rupee, it translates into a requirement to raise prices by 77 paise. In the current context, oil prices have reduced by an average of $7 while the rupee has depreciated by 50 paise against the dollar. In rupee terms, the fall is pegged at 7.7% or Rs 451 to Rs 5392.88 per barrel on Wednesday from prices of Rs 5844.36 per barrel in the last fortnight. 

"We review petrol prices on a fortnightly basis, which not only depends upon international crude oil prices but also on international product prices and exchange rate fluctuations. It's true that crude oil prices have fallen but at the same time the rupee has also depreciated against the dollar to Rs 55.79 from Rs 55.36, when the prices were last reviewed," BPCL chairman R K Singh told TOI. After reviewing global product prices and adjusting for exchange rate fluctuations, we will be happy to pass on the benefit to consumers", he said.

Echoing similar feelings, HPCL finance director B Mukherjee said that though the Indian basket of crude oil prices has fallen to $96.5, they would have to take the average of the last two weeks to decide on the petrol prices.

Earlier this week, finance minister Pranab Mukherjee had hinted at a reduction in petrol prices on falling crude oil prices. "A reduction in petrol prices will set the stage for the government to increase diesel prices after the presidential elections gets over as oil firms are losing Rs 12.5 per litre on sale of diesel, which is an administered product," said an oil analyst. Oil firms are losing over Rs 450 crore per day on sale of sensitive petroleum products like diesel, cooking gas and kerosene with effect from June 1.