హైదరాబాద్ : రేపు రాష్ట్రంలో 18 అసెంబ్లీ స్థానాలకు, నెల్లూరు ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల కోసం సర్వం సిద్ధమైంది. ఉప ఎన్నికల సమరంలో 46లక్షల 13వేల 589 మంది ఓటేయనున్నారు. ఇందులో 22లక్షల 79వేల 739 మంది పురుష ఓటర్లు ఉండగా, 23లక్షల 33వేల 844 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 13 మంది హిజ్రాలు కూడా ఈ ఉప ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉప ఎన్నికల కోసం 5,413 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఉప ఎన్నికల కోసం 50వేల మంది సిబ్బంది పని చేయనున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందు కోసం 6,266 బ్యాలెట్ మిషన్లను సిద్ధం చేశారు. గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 550 రూట్లలో పోలీసు మొబైల్ వ్యాన్లు తిరగనున్నాయి. 66మంది ఈసీఐఎల్ సంస్థకు చెందిన సాంకేతిక నిపుణులు పోలింగ్‌లో సహాయపడనున్నారు. ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇచ్చారు.
18 అసెంబ్లీ స్థానాల్లో 255 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నెల్లూరు ఎంపీ స్థానానికి 13 మంది పోటీ పడుతున్నారు. పరకాల-16, నరసన్నపేట-6, పాయకరావుపేట-9, రామచంద్రాపురం-16, నరసాపురం-9, పోలవరం-6,ప్రతిపాడు-11, మాచర్ల-13, ఒంగోలు-23, ఉదయగిరి-14, రాజంపేట-19, కోడూరు-16, రాయచోటి-16, ఆళ్లగడ్డ-16,ఎమ్మిగనూరు-12, రాయదుర్గం-9, అనంతపురం అర్బన్-12, తిరుపతి అసెంబ్లీ స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు రూ.42 కోట్ల 52 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. రూ.12కోట్ల 72 లక్షల విలువైన ఆభరణాలను పట్టుకున్నారు. లక్షా 94 వేల లీటర్ల మద్యాన్ని కూడా పట్టుకున్నారు. ఇప్పటి వరకు 8మంది అభ్యర్థులకు ఎన్నికల కోడ్ ఉల్లంఘన నోటీసులు జారీ చేశారు.ఉప ఎన్నికల సందర్భంగా ఆరోపణలు ఎదుర్కొన్న విశాఖ అడిషనల్ ఎస్పీని బదిలీ చేశారు.