శ్రీనగర్: ప్రతిష్టాత్మక అమరనాథ్ యాత్రలో భక్తుల మృతుల సంఖ్య 85కు చేరింది. అమరనాథ్ యాత్రలో మరో ఇద్దరు యాత్రికులు మంగళవారం మరణించారు. మరణించిన యాత్రికులు అశోక్ కీమా (జమ్మూ), పథీరా లాల్ (గుజారాత్)కు చెందిన వారిగా గుర్తించారు. అమరనాథ్ యాత్రలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువగా.....
గుండెపోటుతోనే మరణించారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకూ 500586 మంది యాత్రికులు అమరనాథ్ పుణ్య క్షేత్రాన్ని సందర్శించారు. అమరనాథ్ యాత్రలో చేసిన ఏర్పాట్లపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అమరనాథ్ ఏర్పాట్లపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి, జమ్మూ, కాశ్మీర్ ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.