న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సోమవారం పావు శాతం పెంచింది. దీంతో ఇకపై మూడు-అయిదేళ్ల టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు ప్రస్తుతమున్న 8.75 శాతం నుంచి 9 శాతానికి పెరుగుతుందని తెలిపింది. కొత్త రేటు మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని వివరించింది....
మిగతా డిపాజిట్లపై వడ్డీ రేట్లు మాత్రం యధాతథంగా ఉంచింది. మరోవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికానెర్ అండ్ జైపూర్ (ఎస్‌బీబీజే) దేశీ డిపాజిట్‌దారుల ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పావు శాతం తగ్గించింది. ఇకపై 1-3 ఏళ్ల మెచ్యూరిటీ గల డిపాజిట్లపై వడ్డీ రేట్లు 9.25 శాతంగాను, 3-5 ఏళ్ల డిపాజిట్లపై రేట్లు 9.5 శాతం ఉంటాయి.