NEWS

Blogger Widgets

28.6.12

ఆర్థికరంగానికి కొత్త ఊపు



న్యూఢిల్లీ, జూన్ 27: మందగించిన ఆర్థిక రంగానికి ఊతమిచ్చేందుకు మార్కెట్లో నెలకొన్న నిరాశాధోరణిని తొలగించి మదుపరుల్లో తిరిగి విశ్వాసాన్ని పెంపొం దించే చర్యలు తీసుకోవాలని కొత్తగా ఆర్థిక మంత్రిత్వశాఖ బాధ్యతలు చేపట్టిన ప్రధాని మన్మోహన్‌సింగ్ పిలుపునిచ్చారు. క్షీణపథం పట్టిన ఆర్థికరంగం తీరుపై ఆయన ఆర్థిక శాఖ కు చెందిన సీనియర్ అధికారులతో బుధ వారం పలుదఫాలుగా చర్చించారు. ఈ సంద ర్భంగా ......
ప్రధాని ప్రణాళికా సంఘం ఉపా ధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహూ లవాలియా, పిఎంఇఎసి చైర్మన్ సి.రంగరాజన్, ఆర్థిక రంగానికి చెందిన ఇతర ప్రధాన అధికారులతో సమీక్షా సమావేశాలు జరిపారు. నిరాశావాద వాతావ రణాన్ని సమూలంగా మార్చివేసి ఆర్థిక వ్యవస్థలో కొత్త స్పూర్తి రగిలిం చమని ఆయన అధికారులకు సూచించారు. చెల్లింపుల సమతు ల్యత చక్క బెట్టడంపై తక్షణ దృష్టి పెట్టాలని అన్నారు. ఇందుకోసం దేశంలోకి సంస్థాగత పెట్టుబ డులను ప్రోత్సహించేందుకు అన్ని విధానాలు దోహద పడేలా ఉండాలని మన్మోహన్ పేర్కొ న్నారు. స్వల్పవ్యవధిలో దేశ, విదేశీ మదుపుదార్లలో విశ్వాసాన్ని ప్రాదుకొల్పాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు.
గ్లోబల్ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పి, ఫిచ్ భారత పరపతి రేటింగ్ అవుట్‌లుక్ తగ్గించిన నేపధ్యంలో ద్రవ్య లోటు, కరెంట్ అకౌంట్ లోటు నియం త్రణకు సంబంధించి ప్రధా నంగా చర్చించినట్లు అధికార వర్గాలు పేర్కొ న్నాయ. తొలుత రంగరాజన్, అహ్లూవాలియా లతో చర్చలు జరిపిన ప్రధాని ఈరోజు సాయంత్రం ఆర్థిక కార్యదర్శి ఆర్.ఎస్. గుజ్రాల్, ఆర్థిక వ్యవ హారాల కార్యదర్శి ఆర్.గోపాలన్, వ్యయ విభాగం కార్యదర్శి సుమిత్ బోస్, ముఖ్య ఆర్థిక సలహాదారు కౌశిక్‌బసు తదితరులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఆర్థిక రంగానికి సంబంధించిన అన్ని అంశాలపై ప్రధాని సూచనలు చేశారని వర్గాలు తెలిపాయ.
పిఎంఇఎసి, పిసి నుంచి సమాచార సేకరణ
ప్రధాని మన్మోహన్‌సింగ్ బుధవారం దేశ ఆర్థికవ్యవస్థ తీరుతెన్నులపై సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈమేరకు ఆయన ప్రధాని ఆర్థిక సలహా మండలి (పిఎంఇఎసి) చైర్మన్ సి.రంగరాజన్, ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్‌సింగ్ అహ్లూవాలియాలతో సంప్రతించారు. అభిజ్ఞవర్గాల కథనం మేరకు మందగించిన అభివృద్ధి, అధిక ద్రవ్యోల్బణం, సన్నగిల్లిన ఇనె్వస్టర్ల విశ్వాసం తదితర అంశాలపై మన్మోహన్‌సింగ్ వివరాలు సేకరించారు. అహ్లూవాలియా, రంగరాజన్‌లు వేర్వేరుగా ప్రధానితో సమావేశపై దేశ ఆర్థిక పరిస్థితిపై వివరించారు. ప్రముఖ ఆర్థికవేత్తగా పేరున్న మన్మోహన్‌సింగ్ కొత్తగా ఆర్థికమంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.