ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ పౌర హక్కుల నేత బినాయక్ సేన్, ఆయనతో పాటు జార్ఖండ్ హక్కుల నేత బులూ ఇమామ్‌లకు గాంధీ అంతర్జాతీయ శాంతి పురస్కారం లభించింది. ఈ విషయాన్ని లండన్‌లోని గాంధీ ఫౌండేషన్ తాజాగా అధికారిక ప్రకటనలో పేర్కొంది.
ఈ అవార్డును గత 1998 సంవత్సరంలో సురుర్ హోడా, డయానా షూమెకర్ గాంధీ ఫౌండేషన్ అధ్యక్షుడు లార్డ్ అటెన్‌బరో సహాయంతో నెలకొల్పారు. సంస్థలుగానీ, వ్యక్తిగతంగా గాంధీ సిద్ధాంతాలైన అహింసా పద్ధతులను ఆచరిస్తూ ప్రజలకు సేవ చేసే వారిని ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈసారి ఈ అవార్డుకు భారత్‌కు చెందిన ఇద్దరు ఎంపిక కావడం విశేషం.
బెంగాల్‌కు చెందిన పిల్లల వైద్య నిపుణుడు బినాయక్ సేన్ ఒక వైపు వైద్య సేవలు అందిస్తూనే, ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన ప్రాంతాల్లో పౌర హక్కుల కోసం పోరాడుతున్నారని గాంధీ పౌండేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.