అనుష్క పనిలో ఉన్న శ్రద్ధను చూసి తెలుగువారేమోకానీ, తమిళులు కూడా నోరు వెళ్ళబెడతున్నారు. అక్కడ ప్రస్తుతం అనుష్క మంచి ఫామ్‌లో ఉంది. కోలీవుడ్‌లో ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు సైతం అనుష్క డేట్స్ కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది అంటే ఆమె హవా అర్థం చేసుకోవచ్చు. తాజాగా ‘అలెక్స్ పాండ్యన్’ అనే సిని మాలో అనుష్క హెలికాప్టర్‌ను పట్టుకుని వేలాడే సీన్ ఉంది. దాన్ని అనుష్క బదులు డూప్‌ను పెట్టాలని అనుకున్నారు. ఆ సన్నివేశానికి కోటి 80 లక్షలు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. అయితే అది తనే చేస్తానని కొద్దిగా రిహార్సల్ చేసి, షాట్ ఓకే చేసేసిందట.
|