స్విట్జర్లాండ్‌లో ‘శ్రీమన్నారాయణ’
బాలకృష్ణ, పార్వతీ మెల్టన్, ఇషాచావ్లా ప్రధాన పాత్రధారులుగా ఆర్. ఆర్. మూవీ మేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘శ్రీమన్నారాయణ’. రవికుమార్ చావలి దర్శకత్వంలో రమేష్ పుప్పాల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మలేషియా షెడ్యూల్ పూర్తి చేసుకుని, యూరప్‌లోని స్విట్జర్లాండ్‌లో పాటల చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత పుప్పాల రమేష్ మాట్లాడుతూ ఈ షెడ్యూల్‌లో చేస్తున్న షూటింగ్ సినిమాకు హైలెట్‌గా వుంటుందని, రెండు పాటల్ని భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నామని, ఈనెల 28 వరకు షూటింగ్‌తో దాదాపుగా చిత్రం పూర్తవుతుందని, జూలైలో పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి, ఆగస్టులో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని, బాలకృష్ణ అభిమానులకు నచ్చే విధంగా సినిమా రూపొందుతుందని తెలిపారు. విజయ్‌కుమార్, సురేష్, వినోద్‌కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్‌రెడ్డి, కృష్ణ్భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావూ రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న చిత్రానికి కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, సంగీతం: చక్రి, మాటలు: పోలూర్ ఘటికాచలం, ఎడిటింగ్: గౌతంరాజు, నిర్మాత: రమేష్ పుప్పాల, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రవికుమార్ చావలి.