కోర్టుకు నేరుగా వస్తా : జగన్
హైదరాబాద్ (వి.వి) : అక్రమాస్తుల కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో వున్న వైఎస్ జగన్ నాంపల్లి కోర్టులో శనివారం ఒక మెమో దాఖలు చేశారు. ఈ నెల25వ తేదీన తన రిమాండ్ ముగు స్తుందని, అదే రోజు తనను కోర్టు విచా రించనుం దని అందులో తెలిపారు. ఈసారి జరిగే విచార ణకు తాను కోర్టుకు నేరుగా హాజరవుతానని,తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించవద్దని ఆయన కోర్టును కోరారు. ఈ మేరకు జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని జగన్ కోర్టును కోరారు. జగన్‌ను ఒకసారి కోర్టుకు వ్యాన్‌లో తీసుకువచ్చిన సమయంలో జరిగిన రచ్చ దృష్టిలో పెట్టుకొని ఇంత వరకు ఆయన్ని కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారిస్తూ వస్తోంది. అయితే జగన్ దీనికి భిన్నంగా కోర్టులో మెమో దాఖలు చేయడం సం చలనం రేపింది. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందోనని న్యాయ నిపుణులు ఎదురు చూస్తున్నారు.