NEWS

Blogger Widgets

2.7.12

నల్లడబ్బు దాచుకునేందుకు మరింత చోటు



స్విస్‌ బ్యాంకుల మరో ఆఫర్‌...
డబ్బు నిల్వకు సేఫ్టీ డిపాజిట్‌ బాక్సులు
న్యూఢిల్లీ : స్విస్‌ బ్యాంకులలోని రహస్య ఖాతాలలో నల్లధనం పెద్ద మొత్తంలో దాస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో దానిని అరికట్టేందుకు అంతర్జాతీయంగా చర్యలు తీసుకుంటున్న నేప థ్యంలో భారత్‌, ఇతర దేశాలకు చెందిన తమ ధనిక ఖాతాదారులను కాపాడేందుకు బ్యాంకర్లు నూతన ఆలోచనలు చేస్తున్నాయి. తమ సురక్షిత డిపాజిట్‌ బాక్సులు వారికి స్వర్గధామాలుగా ఉప యోగపడేలా బ్యాంకర్లు ఆలోచన చేస్తున్నాయి. వెయ్యి ఫ్రాన్స్‌ నోట్లను ఈ బాక్సులలో స్టోర్‌ చేసుకు నేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. స్విస్‌ బ్యాంకుల లోపల ఈ బాక్సులను వుంచుతున్నారు.. ఈ బాక్సు లలో బంగారం, వజ్రాలు, చిత్రాలు తదితర విలు వైన వస్తువులను దాచుకోవచ్చునని చెపుతున్నాయి. స్విట్జర్లాండ్‌తో ఇతర దేశాలు చేసుకున్న బ్యాంకింగ్‌ సమాచార మార్పిడి ఒప్పందం కారణంగా విదేశీ ప్రభుత్వాల కళ్లు ఈ బాక్సులపై పడే అవకాశం తక్కువగా వుంటుందని భావిస్తున్నారు. భారత్‌, ఇతర దేశాలతో చేసుకున్న పన్ను, ఇతర సమాచార మార్పిడి ఒప్పందాలు ఖాతాదారుల సేవింగ్స్‌, డిపా జిట్లు, పెట్టుబడుల ఖాతాలకు సంబంధించి సమా చారం వెల్లడించే నిబంధనలు సేఫ్‌ డిపాజిట్‌ బాక్సు లకు వర్తించవని స్విస్‌బ్యాంకుల యాజమాన్యాలు భారత్‌, ఇతర దేశాలలోని ధనిక ఖాతాదారులకు చెపుతున్నాయని పరిశ్రమల వర్గాలు తెలిపాయి. ఫలితంగా స్విస్‌ బ్యాంకులలోని సేఫ్‌ డిపాజిట్‌ బాక్సులకు, వెయ్యి స్విస్‌ ఫ్రాన్స్‌ బ్యాంకు నోట్లకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. వాటిని పొందేందుకు ప్రపంచంలోని ధనికులు స్విట్జర్లాండ్‌కు పరుగులు తీస్తున్నారు.

స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంకు ఎస్‌.ఎన్‌.బి. (స్విస్‌ నేషనల్‌ బ్యాంకు) వద్ద అందుబాటులో వున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం పంపిణీలో వున్న స్విస్‌ అన్ని బ్యాంకునోట్ల మొత్తం విలువలో వెయ్యి-ఫ్రాన్స్‌ నోట్లు 60 శాతం వున్నాయి. సంవత్సరం క్రితం 50 శాతం వుండేదని, ఇప్పుడు 60 శాతానికి పెరిగిందని ఆ సమాచారం తెలిపింది. పిటిఐ విలేఖరి అడిగిన ప్రశ్నలకు ఎస్‌.ఎన్‌.బి. అధికారులు సమాధానం యిస్తూ, వెయ్యి-ఫ్రాన్స్‌నోట్లకు డిమాండ్‌ గణనీయంగా పెరిగిందని చెప్పారు. సేఫ్‌ డిపాజిట్‌ బాక్సులలో డబ్బు దాచుకునేందుకు అనుమతివ్వటంతో ఈ డిమాండ్‌ పెరిగిందని అంగీకరించారు. విలువైన నోట్ల కోసం విదేశాల నుండి విపరీతమైన డిమాండ్‌ వస్తోందని చెప్పారు. భారత్‌ నుండి భారీగా డిమాండ్‌ వుందా అని అడిగిన ప్రశ్నకు ఎస్‌.ఎన్‌.బి. కచ్చితమైన సమాధానం యివ్వలేదు. డిపాజిట్‌ బాక్స్‌ల వివరాలకు సంబంధించిన ఆ విధమైన సమాచారం లేదన్నారు. వెయ్యి-ఫ్రాన్స్‌ నోట్‌ ప్రస్తుతం భారత్‌లో రు. 60వేల విలువ చేస్తుంది. అందువల్ల ఈ నోట్ల రూపంలో పెద్ద మొత్తంలో డబ్బు ఈ బాక్సులలో దాచుకునే అవకాశం వున్నది.