తన తమ్ముడు లగడపాటి శ్రీధర్ ఎప్పటి నుంచో జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెడుతున్నారని, ఆర్థికం వారి కుటుంబాన్ని ఆదుకున్నారని చెప్పారు. అలాంటి తన తమ్ముడిపై విమర్శలు చేయడం శోచనీయమని లగడపాటి చెప్పారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాలతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని లగడపాటి స్పష్టం చేశారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవినే తృణపాయంగా వదులుకున్నారని చెప్పారు. అవినీతిపరులు ఎంతటివారలైనా శిక్షార్హులే అని ఆయన అన్నారు. అవినీతిని ఒక్కరోజులో అంతమొందించడం అంత సులభం కాదన్నారు.