NEWS

Blogger Widgets

23.6.12

సిరయన్ శరణార్దుల సహాయార్దం రూ 56 లక్షల విరాళం- ఏంజిలీనా జోలీ

లండన్, జూన్ 22: హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజిలీనా జోలీ సిరయన్ శరణార్దుల సహాయార్దం $100,000(రూ 56 లక్షల 15 వేలు)ను విరాళంగా ఇచ్చారు. 37 సంవత్సరాల వయసు కలిగిన ఏంజిలీనా జోలీ ప్రస్తుతం యునెటైడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ (యూఎన్‌హెచ్‌సీఆర్)కు ప్రత్యేక రాయబారిగా వ్యవహరిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకోని మే 20వ తారీఖైన ప్రపంచ శరణార్థుల దినం రోజున ఈ మొత్తాన్ని ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంస్థకు స్వయంగా అందజేయనున్నారు.
jolie donates 100 000 help refugees
ప్రతి వ్యక్తి శరణార్థ విషయాలలో తమ వంతు సహాకారం అందించాలని అన్నారు. ప్రతి ఒక్కరికి ఒక్కో కథ ఉంటుంది. ప్రతి ఒక్కరూ బాధపడడం, భరించలేని విధంగా బ్రతికారు. మీ సహాయంతో వారు మరోక రోజు నివసించే అవకాశం కలుగుతుంది. ఇది ఇలా ఉంటే ఏంజిలీనా జోలీ తనకి కాబోయే భర్త బ్రాడ్ పిట్ కోసం హెలికాప్టర్‌ని కొనుగోలు చేసింది.
ఏంజిలీనా జోలీ, బ్రాడ్ పిట్ ఇద్దరూ త్వరలో వివాహాం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఏంజిలీనా జోలీ 1 మిలియన్ పౌండ్స్ ని ఖర్చు చేసి మరీ ఈ హెలికాప్టర్‌ని కొనుగోలు చేసి బ్రాడ్ పిట్‌కు గిప్ట్ గా అందివ్వనుంది. దీని కోసం ప్రత్యేకించి దక్షణ ఫ్రాన్స్ చాటూ మిరావల్‌లో ఉన్న ఇంట్లో హెలికాప్టర్ ప్యాడ్‌ని ఇప్పటికే సిద్దం చేసింది. ఈ విషయంపై స్పందించిన జోలీ ఈ గిప్ట్‌ని బ్రాడ్ పిట్‌కి ప్రజెంట్ చేస్తే ఆశ్చర్యపడతాడని తెలిపింది.