ఇక 'ది ఎమేజింగ్ స్పైడర్‌మేన్' పేరుతో అత్యంత భారీ బడ్జెట్‌తో తయారైన చిత్రానికి మార్క్ వెబ్ దర్శకత్వం వహించారు. సోని పిక్చర్స్ సంస్థ ద్వారా తెలుగు, ఇంగ్లీషు, హిందీ వెర్షన్లలో ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. కొత్త కథ, సరికొత్త సాహసాలతో ఆద్యంతం ఆసక్తికరంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో స్పైడర్‌మేన్‌గా ఆండ్రూ గార్‌ఫీల్డ్ నటించగా, అతని ప్రియురాలిగా ఎమ్మాస్టోన్ నటించింది. బాలీవుడ్ హీరో ఇర్ఫాన్‌ఖాన్ మరో ముఖ్య పాత్ర పోషించారు.
తన తండ్రి ఎవరో తెలుసుకోవడం కోసం చేసిన ప్రయత్నంలో భాగంగా తనని తాను తెలుసుకునే ఓ వండర్ కిడ్ కథే ఈ చిత్రమని దర్శకుడు మార్క్ వెబ్ చెప్తున్నారు. సోని పిక్చర్స్ ప్రతినిధి ఈ సినిమా గురించి మాట్లాడుతూ 'స్పెడర్‌మేన్ చిత్రాలకు తెలుగులో కూడా ఆదరణ బాగుంటుంది. అందుకే 'ది ఎమేజింగ్ స్పైడర్‌మేన్' చిత్రాన్ని 2డి, 3డి వెర్షన్లలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో 200కి పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం. సరికొత్త సాహసాలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని పిల్లలతో కలిసి చూడటం ఒక మంచి అనుభూతిని మిగులుస్తుంది' అన్నారు.