బీజింగ్: చైనాలో ప్రయాణికుల విమానాన్ని హైజాక్ చేయడానికి యూగార్ మిలిటెంట్లు చేసిన యత్నం బెడిసికొట్టింది. ప్రయాణికులు, సిబ్బంది వారిని సమర్థంగా అడ్డుకుని ముప్పు తప్పించారు. ఈ సంఘటనలో....
ఏడుగురు ప్రయాణికులు సహా 10 మంది గాయపడ్డారు. యుగార్ జాతి ముస్లింలు చైనా పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న జింజియాంగ్ రాష్ట్రంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాలు.. వంద మంది ప్రయాణికులున్న తియాంజిన్ ఎయిర్‌లైన్స్ విమానం హోతాన్ ఎయిర్‌పోర్ట్ నుం చి రాష్ట్ర రాజధాని ఉరింకీకి టేకాఫ్ తీసుకున్న పది నిమిషాల తర్వాత ఆరుగురు మిలిటెంట్లు హైజాక్‌కు యత్నించారు. విరిగిపోయిన ఊతకర్రను ఆయుధంగా చేసుకుని కాక్‌పిట్‌లోకి చొచ్చుకె ళ్లేందుకు ప్రయత్నించారు. ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలకు తెగించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఒక హెడ్ అటెండెంట్, ఏడుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. విమానాన్ని తిరిగి హోతాన్ ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చారు. పోలీసులు మిలిటెం ట్లను అదుపులోకి తీసుకున్నారు. జింజియాంగ్ జనాభాలో సగ భాగమున్న యుగార్‌లు తమపై జాతి వివక్ష కొనసాగుతోందని ఆరోపిస్తుండం తెలిసిందే.