నితిన్ ‘కొరియర్ బోయ్ కళ్యాణ్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘తమిళ సెల్వనుంతనియార అంజులుం’ అనేది తమిళ వెర్షన్ పేరు...
. ప్రభుదేవ శిష్యుడు ప్రేమసాయి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శుక్రవారం పూజా కార్యక్రమంతో ఈ సినిమాను ప్రారంభించారు.
గౌతమ్ వాసుదేవ మీనన్ మాట్లాడుతూ -‘‘భాషలకు అతీతంగా అందరి అభినందనలు అందుకునే సినిమా ఇది. ప్రేమ, హాస్యం, యాక్షన్ అన్నీ ఈ కథలో ఉంటాయి. గాయకుడు కార్తీక్‌ని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. జై సంతానం, నిటివి గణేశ్ కీలక పాత్రలు పోషిస్తారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది’’ అని తెలిపారు. ఫోటాన్ కథాస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమా రూపొందనుంది.