NEWS

Blogger Widgets

30.6.12

నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ‘అల్లరి’ నరేష్


‘అల్లరి’ నరేష్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘సీమటపాకాయ్’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ హిట్ కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందనుంది. సిరీ పతాకంపై అమ్మిరాజు కానుమిల్లి నిర్మించబోతున్నారు....

విజయ దశమిని పురస్కరించుకుని అక్టోబర్‌లో ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించనున్నారు. ‘సీమటపాకాయ్’లో ‘ఆకాశంలో ఒక తార..’ పాటను రీమిక్స్ చేసినట్లుగానే, ఈ చిత్రంలో కూడా సూపర్‌స్టార్ కృష్ణ నటించిన ఓ హిట్ మూవీలోని పాటను రీమిక్స్ చేయబోతున్నారు. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో నరేష్ సరసన ఓ కొత్త హీరోయిన్ నటించనున్నారు.