పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఎస్.దర్శకత్వంలో శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై అగ్రనిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ 'గబ్బర్‌సింగ్' జూన్ 29తో సూపర్ షేర్స్‌తో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ....
నిర్మాత బండ్ల మాట్లాడుతూ '81 ఏళ్ళ తెలుగు సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా ప్రేక్షకుల అపూర్వ ఆదరణ అందుకుంటున్న పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ గబ్బర్‌సింగ్ 306 కేంద్రాల్లో అద్భుతమైన షేర్స్‌తో 50 రోజులు పూర్తి చేసుకొని 100 రోజుల కోసం అడుగులు వేయడం ఎంతో ఆనందంగా వుంద న్నారు. నిర్మాతగా ఇది నాకు సంచలన విజయ మన్నారు. ఇంతటి విజయానికి అవకా శమిచ్చి న హీరో పవన్, దర్శకులు హరీష్‌శంకర్‌కు, పరమే శ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ యూనిట్ సభ్యులకు, ప్రేక్షకు లకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ 'ఫెయిల్యూర్‌తో స్టార్ట్ అయిన నాకు సక్సెస్ విలువ తెలుసు. 'గబ్బర్‌సింగ్'లాంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చేసే అవకాశం ఇచ్చిన పవర్‌స్టార్, నిర్మాత బండ్ల గణేష్‌కు, 'గబ్బర్‌సింగ్' విజయం కోసం అహర్నిశలూ కృషి చేసిన మా టీమ్ మెంబర్స్ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు. దర్శకుడిగా 'గబ్బర్‌సింగ్' ఘనవిజయం నాకు పెద్ద టర్నింగ్ పాయి ంట్'గా పేర్కొన్నారు. శృతి హాసన్ మాట్లా డుతూ పవన్‌లాంటి పెద్ద స్టార్‌తో కల్సి చేసిన గబ్బర్ సింగ్ పెద్ద హిట్ కావడం ఆనందంగా వుందని, నా కెరీర్‌లో ఇది ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్. ఈ అవకాశం ఇచ్చిన పవన్, గణేష్‌కు కృతజ్ఞతలు చెప్పారు.