
సిద్ధార్థనగర్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ సమగ్రాభివృద్ధికి చేయూతనందించేందుకు జపాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రతినిధి నవోకజు తకెమొటో అన్నారు. గౌతమబుద్ధుడు పెరిగిన కపిలవాస్తు తీర్థ సందర్శనకు ఆయన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మాతా ప్రసాద్ పాండేతో కలిసి శనివారం రాష్ట్రానికి వచ్చారు. అతి తక్కువ భూభాగంతో, ఉత్తర ప్రదేశ్ కంటే తక్కువ జనాభాతో ఉన్న దేశం జపాన్ అని ఆయన తెలిపారు. అయినా, ప్రపంచంలో విద్య, సాంకేతిక రంగాల్లో రెండో స్థానాన్ని పొంది ఉన్నామని తకెమొటో అన్నారు. .....
జపాన్ అధికారిక అభివృద్ధి సహకార సంస్థ (అఫీషియల్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్ - ఓడీఏ) ద్వారా ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి చేపడతామని పేర్కొన్నారు. కపిలవాస్తులో బుద్ధుడి నూతన ఆలయం నిర్మాణం గురించి తమ ప్రభుత్వానికి తెలియజేసి, అక్కడ కూడా బుద్ధుడి ఆలయ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. అలాగే, కపిలవాస్తులో అధునాతన సౌకర్యాలతో ఆస్పత్రి, వైద్య కళాశాల ఏర్పాటు చేసే యోచన కూడా ఉందన్నారు. యూపీ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపిన జపాన్‌కు స్పీకర్ కృతజ్ఞతలు తెలిపారు.