NEWS

Blogger Widgets

15.7.12

సింగపూర్ విమానం రప్పిస్తాం: పురంధేశ్వరి


విశాఖపట్టణం: విశాఖకు సింగపూర్ విమానం రప్పిస్తామని కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి హామీ ఇచ్చారు. విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన విమానాశ్రయ అడ్వయిజరీ కమిటీ సమావేశ ంలో పలు సమస్యలపై చర్చించారు. .....అక్టోబర్‌లో ఇక్కడ సింగపూర్ విమానం దిగడానికి అవసరమయిన చర్యలను ఎయిర్‌పోర్టు డెరైక్టర్ కత్తిక శ్రీనివాసరావు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది కొరత, పనివేళల పెంపునకు అవరోధాలున్నాయని చెప్పారు. దీనిపై ప్రధాని మన్మోహన్‌సింగ్ దృష్టికి తీసుకెళ్తానని పురంధేశ్వరి తెలిపారు.

ఇక్కడ 24 గంటలూ విమానాశ్రయ నిర్వహణకు అనుమతి అవసరమన్న సంగతిని వివరిస్తానన్నారు. దీని కోసం ఒత్తిడి తెస్తానని చెప్పారు. ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ సాంకేతిక అంశాలు పరిష్కారమయితే బ్యాంకాంక్, శ్రీలంక తదితర దేశాల నుంచి విమానాలు నడపడానికి ఆయా దేశాల విమాన సంస్థలు సుముఖంగా ఉన్నాయన్నారు. తద్వారా ప్రవాసాంధ్రులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఏడీసీపీ సురేష్‌బాబు, ఏసీపీ బర్ల ప్రసాదరావు తదితర అధికారులు పాల్గొన్నారు.