NEWS

Blogger Widgets

3.7.12

థియేటర్ల సమ్మె లేనట్లే!


FILE
ప్రస్తుతం ఉన్న థియేటర్లలో టిక్కెట్‌ రేటు పెంచకపోతే థియేటర్ల నిర్వహణ కష్టమైపోతుందనీ, ఫలితంగా రానున్న కొద్దికాలంలోనే అనేక సినిమా థియేటర్లు మూతపడే ప్రమాదముందని..... పలువురు ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ నెల 5న సమ్మె చేయాలని వారంతా అనుకున్నారు. కానీ ఈ రోజు, రేపు ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడంతో తాము సమ్మె విరమించుకున్నట్లు ఎ.పి. ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యదర్శి ముత్యాల రమేష్‌ తెలిపారు. అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు విజేందర్‌ రెడ్డి కూడా మాట్లాడుతూ తాము తలపెట్టిన థియేటర్ల సమ్మె ప్రస్తుతానికి విరమించుకున్నామని పేర్కొన్నారు.

పైరసీ నివారణకు చర్యలు
ఇదిలా ఉండగా, సోమవారంనాడు ఎ.పి. ఫిలింఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం జరుగుతోంది. సినిమాలోని పలు సమస్యలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా పైరసీని అరికట్టేందుకు నడుం బిగించాలని దీనికి ప్రభుత్వం నుంచి సహకారం కోరనున్నట్లు తెలిసింది.