NEWS

Blogger Widgets

3.7.12

దాసరి నరికేస్తానంటే దానికి అర్థముంది!


దాసరి ఈ రోజుల్లో 100 రోజుల వేడుకలో చిన్న సినిమా అంటే నరికేస్తానంటూ ఘాటుగా స్పందించారు. ఆయన ఆవేశానికి ఓ లెక్కుందని ఫిలింనగర్‌వాసులు అంటున్నారు. థియేటర్లు గుప్పెట్లో పెట్టుకుని.... గుత్తాధిపత్యం చేస్తున్న వారిపై ఆయన ఎక్కుపెట్టినట్లు తెలిసింది. ఈ రోజుల్లో చిన్న సినిమాగా విడుదలైతే.. దాన్ని ఎలా బిజినెస్‌ చేసుకోవాలో తెయకపోతే దిల్‌ రాజును నిర్మాత, దర్శకుడు ఆశ్రయించారు. ఆ తర్వాత అంతకుముందులేని థియేటర్లు కూడా వచ్చేశాయి. 

ప్రతి సెంటర్లలోనూ గుత్తాధిపత్యం చేసేవారు దయతలిస్తేనే థియేటర్లు వస్తాయి. 'జులాయి' సినిమా రిలీజ్‌కు దగ్గరైంది. కర్నూల్‌లో థియేటర్‌ ఇవ్వడానికి చేతుల్లో ఆయుధాలు పట్టుకుని కూర్చున్నారు. అసలు మీరు (పెద్దలకు) మాట్లాడే హక్కులేదు. చిన్న సినిమా ఆడటం లేదంటే దానికి ఎవరు బాధ్యులు మీరు కాదా? త్వరలోనే మీపై తిరుగుబాటు వస్తుంది. అప్పుడు థియేటర్లు వదిలిపెట్టి పారిపోవాలి. 

థియేటర్లు లీజుకు తీసుకుంటే మనల్ని ప్రేక్షకులు తంతారనే భయముండాలి. సినిమా తీసేవాడెవడు? నష్టపోయేవాడెవరు? థియేటర్‌ కట్టేవాడు ఎవడు? ఇదే మాట ఐదేళ్ళ నుంచి అంటున్నా... ఏం జరిగినా సరే... దళారీ వ్యవస్థ పోతేనే సినిమా బతుకుతుంది అని ఆవేశంగా మాట్లాడుతుండగానే... స్టేజీ మీద కూర్చున్న దిల్‌రాజు అక్కడ నుంచి మెల్లిగా జారుకోవడం అక్కడివారిని ఆశ్చర్యపర్చింది.