హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో అమెరికాలోని డల్లాస్ నగరంలో ఈనెల 17న ‘కల్యాణ శ్రీనివాసం’ పేరుతో కూచిపూడి నృత్యప్రదర్శన ఏర్పాటుచేశారు. నృత్యప్రదర్శన బృందానికి నేతృత్వం వహించిన శోభానాయుడును ‘విశ్వ నాట్యాచార్య శిరోమణి’ బిరుదుతో, నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ స్కూల్ డెరైక్టర్ శ్రీలత సూరిని ‘నాట్య కళా చూడామణి’ బిరుదుతో సత్కరించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన న్యూజెర్సీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ చివుకుల ఉపేంద్రను సత్కరించారు.
|