NEWS

Blogger Widgets

21.6.12

లొంగిపోయన ఉమేష్



  • 21/06/2012
హైదరాబాద్, జూన్ 20: సస్పెన్షన్‌కు గురైన సీనియర్ ఐపిఎస్ అధికారి ఉమేష్‌కుమార్ బుధవారం నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. ఎంపి ఎ.ఎం.ఖాన్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో కోర్టుకు గైర్హాజరు కావడంతో ఉమేష్‌పై నాంపల్లి కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆ వారెంట్ అమలు కాకుండా ఉమేష్ హైకోర్టును ఆశ్రయించడంతో తాత్కాలికంగా వారెంట్‌ను రద్దు చేసి, ఈ నెల 28లోగా కిందికోర్టులో లొంగిపోవాలని ఉమేష్‌ను ఆదేశించడంతో ఆయన లొంగిపోయారు. 10 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తున దాఖలు చేయడంతో నాంపల్లి కోర్టు ఆయనపై ఉన్న అరెస్టు వారెంట్‌ను వెనక్కితీసుకుంది. దీంతో ఉమేష్‌కుమార్‌కు తాత్కాలిక ఉపశమనం కలిగింది. అరెస్టు వారెంట్ జారీ అయిన తర్వాత మూడు రోజుల పాటు గోదావరి వ్యాలీ అథారిటీ చైర్మన్‌గా విధులకు హాజరు కానందుకు క్రమశిక్షణ చర్యగా రాష్ట్రప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఫోర్జరీ కేసులో గురువారం మరోసారి నాంపల్లి కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.