NEWS

Blogger Widgets

27.6.12

మెగా అభిమానులూ... చిరంజీవి పుట్టినరోజే రాంబాబు లుక్‌!


WD
పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తాజా చిత్రం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' చిత్రం. పూరీ జగన్నాథ్‌ డైరెక్టర్‌. గబ్బర్‌సింగ్‌ హిట్‌ తర్వాత పవన్‌ స్టామినా పెరిగిపోయింది. ఫ్యాన్స్‌ కూడా ప్రతీదానికి పవన్‌ పేరును ముందుకు తెచ్చి.. హైలైట్‌ చేయడం మామూలైపోయింది. 

అందుకే గంగతో రాంబాబు చిత్రం ఫస్ట్‌లుక్‌ ఎప్పుడని అందరూ అడుగుతున్నారు. వారి ఆనందానికి తగినట్లుగా చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22న చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయాలని ప్లాన్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ సారథిలో స్టూడియోలో పెద్ద సెట్‌ వేసి అక్కడే జరుపుతున్నారు. 

ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 18న విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.