రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ చిత్రం జులై 6న విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈచిత్రం తెలుగు సినిమా చరిత్రలో గ్రాఫిక్స్ పరంగా ఓ అద్భుతమైన ప్రాజెక్టుగా తీర్చి దిద్దారు. కెరీర్లో అపజయం అంటూ ఎరుగని జక్కన ఈచిత్రం కోసం దాదాపు రెండు సంవత్సరాలు కష్ట పడ్డారు. వారాహి చలన చిత్రంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి సురేష్ బాబు సమర్పిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు. దాదాపు రూ. 26 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది.
ఇక శ్రీదేవి ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రం విషయానికొస్తే....భర్త పిల్లలు తప్ప వేరే ప్రపంచం తెలియని ఓ మహిళ అనుకోకుండా ఒంటరిగా న్యూయార్క్ వెళ్లాల్సి వస్తుంది. బయటి ప్రపంచం తెలియని ఆవిడ అక్కడ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొనాల్సి వస్తుంది, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎన్ని తంటాలు పడుతుంది. ఆతర్వాత అందరికీ ఎలా ఆదర్శంగా నిలిచింది అనేది కథాంశం. పల్లెటూరి యువతిగా శ్రీదేవి తనదైన నటనతో ఆకట్టుకుంటుంది. ఆమె నటనే ప్రధానాకర్షణగా తెరకెక్కిన ఈ చిత్రంలో అందరికి కావాల్సిన కమర్షియల్ అంశాలన్నీ ఇందులో వున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.