సాధారణంగా టాప్ హీరోల సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకోవడానికి 6 నుంచి 12 నెలల సమయం తీసుకుంటుంది. ఇంత త్వరగా సినిమా పూర్తి కావడంపై నిర్మాత రమేష్ పుప్పాల సంతోషం వ్యక్తం చేస్తూ బాలయ్య ప్రొఫెషనలిజంపై పొగడ్తల వర్షం కురిపించారు.
ఆర్ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై బాలకృష్ణ కథానాయకుడిగా రవికుమార్ చావలి దర్శకత్వంలో ‘మిరపకాయ్' నిర్మాత రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులైలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసి ఆగస్టులో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అభిమానులు బాలయ్య నుంచి ఎక్స్‌పెక్ట్ చేసే అన్ని అంశాలు ‘శ్రీమన్నారాయణ'లో ఉంటాయి.
బాలకృష్ణ, పార్వతీ మెల్టన్, ఇసా చావ్లా, విజయ్ కుమార్, సురేష్, వినోద్ కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, సినిమాటోగ్రఫీ: టి.సురేందర్ రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: నాగేందర్, కో డైరెక్టర్: ఎస్ సురేష్ కుమార్, పబ్లిసిటీ డిజైనర్ : రమేష్ వర్మ, కాస్ట్యూమ్స్: ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: వి.చంద్రమోహన్, మేనేజర్స్: కమల్ మోహన్ రావు, రామ్మోమన్, నిర్మాత: పుప్పాల రమేష్, కథ-కథనం-దర్శకత్వం: రవికుమార్ చావలి.