NEWS

Blogger Widgets

6.7.12

ఇంటర్నెట్ అశ్లీల వ్యాసాలు.. ఫోటోల ప్రదర్శనలో కేరళ ఫస్ట్!



women
File
FILE
దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్ర కేరళ. అదేసమయంలో ఇంటర్నెట్‌ను అధికంగా వినియోగిస్తున్న రాష్ట్రం కూడా కేరళనే కావడం గమనార్హం. అలాగే, ఇంటర్నెట్‌లో అశ్లీల పోస్టర్లు పెట్టడం, వ్యాసాలు ప్రచురించడంలోనూ ఈ రాష్ట్రమే మొదటి స్థానంలో ఉన్నట్టు తేలింది.... 

నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో ఇటీవల విడుదల చేసిన 'క్రైమ్ ఇన్ ఇండియా 2011' నివేదికలో ఈ ఆసక్తికర అంశం వెలుగు చూసింది. ఈ నివేదిక ప్రకారం...ఇంటర్‌నెట్‌ వినియోగం, సైబర్‌ నేరాలు పెరగడం, అశ్లీల వ్యాసాలు, ఫొటోలు ఇంటర్‌నెట్‌లో పెట్టడంలో కేరళ ప్రథమస్థానంలో ఉన్నట్టు తేలింది. 

గత ఏడాది దేశంలో 496 అశ్లీల ప్రచురణలకు సంబంధించిన కేసులు నమోదైతే 27 శాతం అంటే 136 కేసులు ఒక్క కేరళలోనే నమోదై ప్రథమస్థానంలో నిలిచిందని ఈ నివేదిక తేల్చింది. అలాగే, గత ఏడాది ఒక్క కేరళలోనే 55 శాతం సైబర్‌ నేరాలు నమోదు కాగా, 245 సైబర్‌ నేరాలు నమోదైనట్లు తెలిపింది. 

ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 52 సైబర్‌ నేరాలు నమోదు కాగా 40 కేసులతో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ తర్వాత స్థానాలు ఆక్రమించాయి. కేరళవాసులు అత్యధికంగా సైబర్‌ వరల్డ్‌ను వినియోగిస్తూ ఈ అంతర్జాలం ద్వారా మహిళలను వేధించడం, ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడటం వంటి నేరాలకు పాల్పడుతున్నారని ఈ నివేదిక తేల్చింది.