హీరోయిన్ కాజల్ అగర్వాల్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న ‘బాద్ షా’ చిత్రం కోసం ఓ సాహసం చేయబోతోంది. ఇప్పటి వరకు తన పాత్రకు తాను డబ్బింగ్ చెప్పుకోవడం కూడా రాని ఈ బ్యూటీ ఏకంగా ఈ చిత్రంలో ఓ పాట పాడబోతోంది. మ్యూజిక్ డెైరెక్టర్ తమన్ ఇందుకోసం ఆమెకు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇస్తున్నాడట. గతంలో తమన్ మహేష్ బాబు, పూరిలతో ‘బిజినెస్ మేన్’ చిత్రంలో పాట పాడించిన విషయం తెలిసిందే. జూ ఎన్టీఆర్-కాజల్ కాంబినేషన్లో ఇప్పటికే బృందావనం లాంటి హిట్ సినిమా రావటంతో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ హిల్లేరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం ప్లస్సవుతుందనిభావిస్తున్నారు. ఇప్పటికే రెడీ, దూకుడు లాంటి చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీను వెైట్ల ఈ సారి అంతకు మించిన ఎంటర్‌టైన్మెంట్ సబ్జెక్టుతో ‘బాద్ షా’ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. దూకుడు చిత్రానికి పనిచేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ ‘బాద్ షా’ చిత్రానికి పనిచేస్తున్నారు. |