న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యాలయం ఉండే నార్త్‌బ్లాక్‌లో ఆదివారం మధ్యాహ్నం స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు. కరెంట్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
మధ్యాహ్నం 2.20 గంటలకు నార్త్‌బ్లాక్‌లోని ఓ కిటికీ నుంచి దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన పోలీసులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఏడు నిమిషాల వ్యవధిలోనే ఓ అగ్నిమాపక వాహనం అక్కడికి చేరుకుంది. తర్వాత మరో ఏడు వాహనాలు వచ్చాయి. మొత్తమ్మీద 15 నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన చోటుకి సమీపంలోనే హోంమంత్రి చిదంబరం కార్యాలయంతోపాటు హోంశాఖ సహాయ మంత్రి ఎం.రామచంద్రన్, సిబ్బం ది వ్యవహారాల శాఖ సహాయమంత్రి వి.నారాయణస్వామి కార్యాలయాలు ఉన్నాయి.