NEWS

Blogger Widgets

25.6.12

ఇక క్షిపణి దుర్బేధ్యం



క్షిపణి రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించే పని ఇప్పటికే ప్రారంభమైందని, మొత్తం ప్రాజెక్టును కూలంకషంగా విశే్లషించిన తర్వాత ప్రభుత్వం ముందు ఉంచడం జరుగుతుందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. శత్రు క్షిపణుల జాడను తెలుసుకోవడానికి రాడార్లను ఏర్పాటు చేసేందుకు, ఎదురుదాడి చేసే వ్యవస్థలను నిల్వ ఉంచడానికి అనువైన స్థలాలను ప్లానింగ్ దశలో ఎంపిక చేయడం జరుగుతుందని ఆ వర్గాలు తెలిపాయి. గగనతల దాడుల నుంచి వీలైనంత ఎక్కువ రక్షణ ఉండేలా చూడటం కోసం డిఆర్‌డిఓ భూవాతావరణం లోపలేకాకుండా వెలుపలా ఉండే శత్రు క్షిపణులను కూల్చివేసే క్షిపణులను ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. ఈ వ్యవస్థ అంతా పూర్తిగా యాంత్రికమైనదే కావడంతో మానవ సాయం పెద్దగా అవసరం ఉండదని కూడా ఆ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ, ముంబయి నగరాల్లో విజయవంతంగా అమలు చేసిన తర్వాత మిగతా ప్రధాన నగరాల్లోనూ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు చెప్పారు.
డిఆర్‌డిఓ రూపొందించిన క్షిపణి రక్షణ వ్యవస్థను ఇప్పటికే అనేకసార్లు విజయవంతంగా పరీక్షించి చూశారు. దాదాపు 2 వేల కిలోమీటర్ల దూరంలో మన దేశం వైపునకు దూసుకొచ్చే బాలిస్టిక్ క్షిపణులను సైతం అది నాశనం చేయగలదు. పరీక్షల సమయంలో డిఆర్‌డిఓ శాస్తజ్ఞ్రులు వివిధ రకాల పృథ్వీ క్షిపణులను టార్గెట్లుగా ఉపయోగించి వాటిని గాలిలోనే విజయవంతంగా కూల్చి వేయగలిగారు. 2016 నాటికి వ్యవస్థను 5వేల కిలోమీటర్ల స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తారు
.