NEWS

Blogger Widgets

12.6.12

సీమాంధ్ర బస్సులు ఫుల్


హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉప ఎన్నికల నేపథ్యంలో సీమాంధ్రకు వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్ సోమవారం రద్దీగా మారింది. ఓటు హక్కును వినియోగించుకొనేందుకు నగరవాసులు భారీ సంఖ్యలో తమ సొంత ఊళ్లకు పయనమయ్యారు. షెడ్యూల్డ్ బస్సుల్లో టికెట్లు ముందుగానే రిజర్వ్ అయిపోవడంతో... ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులను నడిపారు.

సాయంత్రం 6 గంటల వరకే రాయలసీమ బస్సు టికెట్లు 85 శాతం, విజయవాడ వైపు వెళ్లే బస్సులు 95 శాతం, ఒంగోలు, నెల్లూరు, కందుకూరు వైపు వెళ్లే బస్సుల్లో 100 శాతం టికెట్లు రిజర్వు అయిపోయాయి. ఆర్టీసీ అధికారులు 30 అదనపు బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేయగా వీటిలో సగానికి పైగా టికెట్లు సాయంత్రానికే అయిపోయాయి. రద్దీని బట్టి మరిన్ని అదనపు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఎంజీబీఎస్ ఏటీఎం బీవీ ప్రసాద్ తెలిపారు.