Jun-11-2012 11:52:03 | |
మణిరత్నం తాజా చిత్రం ‘కడల్'నుంచి సమంతని తొలిగించిన సంగతి తెలిసిందే. ఆమెపై కొన్ని కీ సీన్స్ షూట్ చేసాక ఆమెను చిత్రం నుంచి తొలిగించారు. హీరో కన్నా ఆమె పెద్దదిగా కనిపిస్తోందనే ఉద్దేశంతో ఆమెకు బై చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే సమంత అదేమీ నిజం కాదని,తను ఆ ప్రాజెక్టు నుంచి బయిటకు రావటానికి కారణం వేరే ఉందని మీడియాతో వద్ద ఖడించింది.
సమంత ఈ విషయమై మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా రెస్ట్ లేకుండా కంటిన్యూగా షూటింగ్స్ చేస్తున్నాను. దానివల్ల ఆ మధ్య అస్వస్థతకు గురయ్యాను. దాంతో నా షూటింగ్ షెడ్యూల్స్ కొంచెం అటూ ఇటూ అయ్యాయి. అందువల్ల మణి సార్ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అది నా దురదృష్టం. మణి సార్ దర్శకత్వంలో షూటింగ్‌కి వెళ్లకుండానే వదులుకోవాల్సి వచ్చింది అని క్లారిఫై చేసింది. |