విశాఖపట్నం,న్యూస్‌లైన్: పరిస్థితులు అనుకూలించని కారణంగా నైరుతి రుతుపవనాల రాకకు మరికొన్ని రోజుల సమయం పడుతుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం డెరైక్టర్ వీఎల్ ప్రసాదరావు వెల్లడించారు. గాలి దిశ ప్రభావితం చేస్తున్నప్పటికీ ఆ రుతుపవనాలు కోస్తావైపు కొనసాగితేనే వర్షాలు కురుస్తాయన్నారు. రెండు, మూడురోజుల్లో పరిస్థితులు చక్కబడే అవకాశం ఉందని, బంగాళాఖాతంలో ఇంకామార్పులు రావాల్సిందేనని తెలిపారు.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయని, తెలంగాణ, రాయలసీమల్లో ఇప్పటికే ఆ పరిస్థితి కనిపించిందన్నారు. రానురాను మరింత తగ్గుతాయన్నారు. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జల్లులు గానీ, ఉరుములతో కూడిన జల్లులు గానీ కురిసే అవకాశం ఉందన్నారు.
|