సచిన్‌కు విజ్డెన్ అవార్డు
దుబాయ్, జూన్ 11: క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులను, లెక్కకు మించిన అవార్డులను తన ఖాతాలో చేర్చుకున్న భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్‌కు మరో అవార్డు లభించిం. ‘క్రికెట్ బైబిల్’గా పేర్కొనే విజ్డెన్ పత్రిక అతనిని ‘అవుట్‌స్టాండింగ్ అచీవ్‌మెంట్’ పురస్కారంతో సన్మానించింది. కెరీర్‌లో 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించినందుకు సచిన్‌కు అరుదైన అవార్డు కింద ఓ ట్రోఫీని అందించింది.