NEWS

Blogger Widgets

12.6.12

అనిల్ బయ్యారం లింక్స్: టార్గెట్ షర్మిల



Target Is Sharmila Anil Bayyaram Links
బయ్యారంతో వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు అనిల్‌కు సంబంధాలు అంటగడుతూ వార్తలు రాయడం వెనక షర్మిలను టార్గెట్ చేసుకున్నారని అంటున్నారు. ఈ మేరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రిక ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. షర్మిలకు లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక బయ్యారం గనులతో అనిల్‌కు లింక్ పెడుతున్నారంటూ ఆరోపించింది. బయ్యారం గనుల లీజు పొందిన రక్షణ స్టీల్స్‌తో తనకు ఏ విధమైన సంబంధం లేదని అనిల్ ప్రకటించారు.
బయ్యారం గనుల లీజును 2010లోనే ప్రభుత్వం రద్దు చేసిందని, ఇప్పుడు ఎన్నికల సమయంలో లీజు రద్దయిందంటూ వార్తలు లీక్ చేయడం వెనక దురుద్దేశం ఉందంటూ సాక్షి దినపత్రిక తెలిపింది. ఉప ఎన్నికలకు ముందు వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడింది. అనిల్‌కు సంబంధం లేదని రక్షణ స్టీల్స్ ప్రకటించినా ఎల్లో మీడియా కావాలని పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించింది.
బ్రదర్ అనిల్‌కు తమ వ్యాపారంతో సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే తామే ఒప్పందం నుంచి స్వచ్ఛందంగా వైదొలుగుతామని రక్షణ కన్సార్షియం ప్రతినిధులు కొండలరావు, సతీష్ 2010 ఆగస్టులోనే పత్రికా ముఖంగా సవాల్ విసిరారు. వీటికి సమాధానం ఇవ్వకుండానే మల్లీ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నేతలు రక్షణ కన్సార్షియాన్ని బ్రదర్ అనిల్‌కు చెందిందిగా విషప్రచారం చేస్తున్నారని సాక్షి దినపత్రిక వ్యాఖ్యానించింది.
ఖమ్మం జిల్లా బయ్యారం ప్రాంతంలో వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు అనిల్ కుమార్ కుటుంబానికి రూ. 14లక్షల కోట్ల విలువ చేసే ఇనుప ఖనిజం గనులను అప్పగించారని ఆోరపిస్తూ తెలుగుదేశం నేత దాడి వీరభద్రరావు ఈ నెల 9వ తేదీన ఆరోపణ చేశారు. దాన్ని ఈనాడు దినపత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ఆ ఆరోపణ వచ్చిన వెంటనే ఎపిఎండిసి - రక్షణ స్టీల్స్ కన్సార్షియం చేసుకున్న ఒప్పందం రద్దుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పచ్చజెండా ఊపారంటూ సోమవావరం సిఎంవో లీక్ ఇచ్చింది. ఇదంతా ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం, కాంగ్రెసు ఆడిన నాటకంగా సాక్షి దినపత్రిక ఆరోపిస్తోంది.