Jun-11-2012 11:50:42 | |
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం ఏ రేంజిలో హిట్టయిందో కొత్తగా చెప్పక్కర్లేదు. 81 ఏళ్ల తెలుగు సినీ పరిశ్రమలోని రికార్డులన్నింటీనీ బద్దలు కొడుతూ కలెక్షన్ల పరంగా కేకపుట్టిస్తోంది. పవర్ స్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈనేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి పని చేసిన టెక్నీషియన్స్ అందరికీ మామిడి పళ్లను పంపిణీ చేస్తున్నారు. ఇవి ఎక్కడో బయట కొని తీసుకొచ్చినవి కాదు... పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన సొంత తోటలో పండించిన ఫలాలు.
‘గబ్బర్ సింగ్' చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేసిన బ్రహ్మ కడలికి పవర్ స్టార్ నుంచి మామిడి ఫలాలు అందగా....ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలియచేయడమే కాదు... అందుకు సంబంధించిన ఫోటోకు కూడా ట్వీట్ చేశారు. దీన్ని బట్టే అర్థం అవుతోంది ‘గబ్బర్ సింగ్' చిత్రం విజయంపై పవర్ స్టార్ ఎంత ఆనందంగా ఉన్నాడో.ఇటీవలే పవన్ కళ్యాణ్ తొలిసారిగా అంత్యాక్షరి టీంతో కలిసి సెలబ్రేషన్స్‌లో పాటిస్తేట్ చేశారు. త్వరలో ఈచిత్రానికి సంబంధించిన హెక్సా ప్లాటినమ్ డిస్క్ వేడుక జరుగబోతోంది. హెక్సా ప్లాటినమ్ డిస్క్ వేడుకకు కూడా పవన్ దూరంగానే ఉండాలని నిర్ణయించుకున్నా....నిర్మాత బండ్ల గణేష్ పవర్ స్టార్‌ని కన్విన్స్ చేశాడని సమాచారం. పవర్ స్టార్ వస్తాడని తెలియడంతో ఆ వేడుక ఎప్పుడు జరుగుతుందా...తమ అభిమాన హీరోను ప్రత్యక్షంగా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆస్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. |