Jun-12-2012 06:29:15 | |
కందుజ్ : అరగంట వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించడంతో కొండ చరియలు విరిగి ఇళ్లపై పడడంతో ఆప్ఘనిస్థాన్‌లో 90 మందికి పైగా మృతి చెందారు. దేశంలోని ఉత్తర ప్రాంతంలో తెల్లవారుజామున అరగంట వ్యవధిలో సంభవించిన రెండు భూకంపాల వల్ల కొండ చరియలు విరిగి పడి పాతిక ఇళ్లు భూస్థాపితమైపోయాయి. 90మందికి పైగా మరణించి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. సహాయక చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు.
|