NEWS

Blogger Widgets

13.6.12

ఉపపోరులో వైకాపా-16, కాంగ్రెస్-1, తెరాస-1, తెదేపా-0: లగడపాటి జోస్యం!!


lagadapati rajagopal

విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎప్పటిలా ఎన్నికల ఫలితాలపై తన సర్వే అంచనాలను మంగళవారం సాయంత్రం వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించనుందని ఆయన చెప్పారు. దీనికి కారణం జగన్ అరెస్టు, వైఎస్.విజయమ్మ కన్నీటి అస్త్రం బాగా ప్రచారం ప్రభావితం చేశాయన్నారు. 

మంగళవారం సాయంత్రం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... ఈ ఉప ఎన్నికల్లో జగన్ ప్రభావాన్ని కొంతమేరకు తాము నివారించామన్నారు. ముఖ్యంగా. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు ఐక్యమత్యంతో పని చేశాయన్నారు. అందువల్లే ఈ ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. 

అయితే, ఈ ఎన్నికల్లో జగన్ చేసిన తప్పులను, దోపిడీని ముందు నుంచి ఎండగట్టి వుంటే మరోలా ఉండేదన్నారు. ఈ ఉప ఎన్నికల్లో జగన్ చివరి అస్త్రంగా తల్లి విజయమ్మ కన్నీటి అస్త్రాన్ని ప్రయోగించి సక్సెస్ సాధించారన్నారు. 

ఇకపోతే.. మొత్తం 18 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 16 సీట్లలో గెలుపొందవచ్చన్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ ఒకటి నుంచి మూడు స్థానాలు, టీడీపీ రెండు స్థానాల్లో గెలుపొందవచ్చు లేగా ఒక్క స్థానంలో కూడా గెలుపొందక పోవచ్చని ఆయన జోస్యం చెప్పారు. పరకాల స్థానంలో టీఆర్ఎస్ గెలుపొందుతుందన్నారు. 

నెల్లూరు ఎంపీ లోక్‌సభ స్థానం ఉప ఫలితంపై మాత్రం ఈనెల 14వ తేదీ సాయంత్రం తన సర్వే ఫలితాన్ని వెల్లడిస్తానని చెప్పారు. ఎందుకంటే.. ఈ స్థానం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మంట్ల వివరాలు అందాల్సి ఉందని, ఇవి వచ్చిన ఫలితాన్ని వెల్లడిస్తామన్నారు.