దబాంగ్ సినిమా సోనాక్షిసిన్హాకు లాండ్‌మార్క్ సినిమాగా నిలిచిపోతే రెండో సినిమా రౌడీరాథోడ్ సినిమా కూడా వంద కోట్ల క్లబ్‌లో చేరబోతోంది. దీనితో సోనాక్షిసిన్హా ఇప్పుడు బాలీవుడ్‌లో పాతతరం, కొత్త తరం హీరోయిన్లకు ముచ్చెమటలు పట్టించేస్తోంది. ఈ సంవత్సరం బాలీవుడ్ తొలి హిట్ చిత్రంగా చెప్పుకుంటున్న రౌడీరాథోడ్ వంటి చిత్రంలో నటించిన సోనాక్షి మళ్లీ అక్షయ్‌కుమార్‌తో కలిసి నటించబోతోంది. ఇప్పటికే అక్షయ్‌కుమార్‌తో కలిసి ‘జోకర్’ అనే 3డి సినిమాలో నటిస్తున్న సోనాక్షి ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఎగెైన్’ చిత్రంలో నటించనుంది. 2010లో వచ్చిన ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబాయ్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంతో అక్షయ్‌కుమార్‌తో కలిసి నటించిన హ్యాట్రిక్ చిత్రంగా సంచలనం సృష్టించనుంది.
|