NEWS

Blogger Widgets

13.6.12

ఆ ఆర్భాటాల్లేవ్....ఆదర్శవంతంగా చరణ్-ఉపాసన పెళ్లి!


మంగళవారం, జూన్ 12, 2012, 13:54 [IST]
Ram Charan Teja Upasana Wedding Set An Example
బడా బాబులు, కోటీశ్వరుల ఇళ్లల్లో పెళ్లంటే ఏ రేంజిలో హడావుడి ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. దేశ విదేశాల నుంచి పెళ్లి సంబంధించిన అలంకరణ వస్తువులు, అరుదైన పూలు ఇంపోర్ట్ చేసుకుని తమ హోదాను చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు. ధనవంతుల కుటుంబాలకు చెందిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన పెళ్లి కూడా అదే తరహాలో జరుగుతుందని అంతా ఊహించారు.
కానీ అందుకు భిన్నంగా....స్వదేశంలో దొరికే అందమైన అలంకరణ సామాగ్రి, ఇతర హ్యాండీక్రాప్ట్స్ ప్రిపేర్ చేస్తున్నారు ఇరుకుటుంబాల వారు. అలా చేయడం ద్వారా దేశంలోని కళాకారులకు మేలు చేసిన వారం అవుతాం అనేది వారి ఉద్దేశ్యం అంటున్నారు సన్నిహితులు. పెళ్లిలో వాడే ప్రతి వస్తువు విషయంలో దేశీయంగా తయారైన వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారట. ఇలా చేయడం నిజంగా ఆదర్శ ప్రాయమే.
ఇటు చరణ్ కుటుంబంతో పాటు, అటు ఉపాసన కుటుంబం కూడా బాగా ధన వంతులు. పైగా రాజకీయంగా, సీనీ రంగంలో భాగా పలుకు బడి ఉన్న వారు. ఈ నేపథ్యంలో తమ ముద్దుల వారసులు రామ్ చరణ్, ఉపాసన వివాహం దేశ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈ వెంట్‌గా నిర్వహించేందుకు ఇరు కుటుంబాల వాళ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుక కోసం కోట్ల రూపాయలను నీళ్లలా ఖర్చు పెట్టేస్తూ కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు.
చెర్రీ, ఉపాసన జూన్ 14న వివాహమాడబోతున్న సంగతి తెలిసిందే. పెళ్లి వేడుక నేపథ్యంలో హైదరాబాద్ నగర శివార్లలోని హిమాయత్ సాగర్ సమీపంలోని ఉపాసన కుటుంబీకుల ఫాంహౌస్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. వివిఐపిలు పెద్ద ఎత్తున హాజరవుతుండటంతో భద్రత ఏర్పాట్లు కూడా భారీగా చేస్తున్నారు. అదే విధంగా నగరంలోని లగ్జరీ హోటల్స్ అన్నీ చెర్రీ ఉపాసన వేడుకకు హాజరయ్య అతిథుల కోసం ముందస్తుగానే బుక్ అయిపోయాయి.