NEWS

Blogger Widgets

13.6.12

రాష్ట్రంలోకి రుతుపవనాలు



Jun-13-2012 04:37:13
హైదరాబాద్‌ : నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఇవి రాయలసీమను తాకాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. వచ్చే 48 గంటల్లో రాష్ట్రంలో పూర్తిగా విస్తరించనున్నాయని వారు చెప్పారు. వీటి ప్రభావం వల్ల ఆకాశం మేఘావృతమై ఉంటుందని, వర్షాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఖరీఫ్‌కు అన్ని సిద్ధం చేసుకున్న రైతన్న వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. మృగశిర కార్తె జొరబడిన జూన్‌ 8వ తేదీ నుంచి రైతులు వరుణుడి కరుణ కోసం ఆకాశం వైపే చూస్తున్నారు. ఇప్పటికే దుక్కులన్నీ దున్ని చదును చేశారు. సకాలంలో వర్షాలు పడితే, ఈ ఖరీఫ్‌లోనైనా పంటలు పండించుకోవచ్చన్న ఆశతో వారు ఉన్నారు.