హైదరాబాద్ : జగన్ అక్రమాస్తుల కేసులో రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఏప్రిల్ 13న సాయిరెడ్డికి బెయిల్ లభించింది. ఈ బెయిల్‌ను సవాల్ చేస్తూ సీబీఐ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. సాయిరెడ్డి సాక్ష్యాలను తారుమారు చేసినట్లు ఆధారాలు లేవని ఈరోజు హైకోర్టు పేర్కొంది. సాయిరెడ్డి సీబీఐ దర్యాప్తునకు సహకరించాలని స్పష్టం చేసింది. ప్రొఫెషనల్స్ విలువలకు కట్టుబడి ఉండాలని పేర్కొంది. ప్రలోభాలకు లొంగిపోరాదని తెలిపింది. ఆర్థిక నేరాలు దేశాన్ని భ్రష్టు పట్టిస్తాయని హైకోర్టు చెప్పింది. సీబీఐ స్వత్రంత సంస్థ అని, దర్యాప్తు పారదర్శకంగా ఉండాలని హైకోర్టు సూచించింది.
|