Jun-12-2012 09:23:07 | |
బాలకృష్ణకు ఈ మధ్యన ఆయన సరసన చేయటానికి స్టార్ హీరోయిన్స్ ఎవరూ దొరకటం లేదు. యంగ్ హీరోయిన్స్ ఆయనతో చేయటానికి ఏజ్ గ్యాప్ అని ఆసక్తి చూపటం లేదు. త్రిష,అనుష్క వంటివారు సైతం డేట్స్ ఖాళి లేవని తప్పించుకుంటున్నారు. గతం నాలుగైదు చిత్రాల నుంచి అదే పరిస్దితి ఆయనకు ఎదురౌతోంది. తాజాగా అనుష్కతో అంతా ఓకే అనుకున్నాక ఆమె రిజెక్టు చేసిందని సమాచారం.
వివారాల్లోకి వెళితే..బాలకృష్ణ సరసన అనుష్క ఖరారైందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో రూపొందే ఆదిత్య 999 లో ఆమెను తీసుకున్నారంటూ వినపడింది. అయితే ఆమె నో చెప్పిందని,డేట్స్ ఖాళీ లేవని ఆఫర్ రిజెక్టు చేసిందని సమాచారం. అనుష్క, బాలకృష్ణ కాంబినేషన్ లో ఒక్క మగాడు తర్వాత సినిమాలు ఇప్పటివరకూ రాలేదు. అయితే అభిమానులుకు ఆ ఆనందం త్వరలో దక్కనుందని ముచ్చట పడ్డారు. అయితే అది నెరవేరలేదు. |